Railway Apprentice Posts 2024 : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికిగాను 1010 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రేడ్స్
కార్పెంటర్ – 90 పోస్టులు
ఎలక్ట్రీషియన్ – 180 పోస్టులు
ఫిట్టర్ – 260 పోస్టులు
మెషినిస్ట్ – 90 పోస్టులు
పెయింటర్ – 90 పోస్టులు
వెల్డర్ – 260 పోస్టులు
ఎంఎల్టీ రేడియాలజీ -5 పోస్టులు
ఎంఎల్టీ పాథాలజీ – 5 పోస్టులు
పీఏఎస్‌ఏఏ – 10 పోస్టులు
మొత్తం పోస్టులు – 1010
విద్యార్హతలు
ICF Chennai Apprentice Job Eligibility : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నాన్-ఐటీఐ అభ్యర్థులు కూడా అర్హులే.
వయోపరిమితి
ICF Chennai Apprentice Job Age Limit :
ఐటీఐ అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 21 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
నాన్-ఐటీఐ అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
ICF Chennai Apprentice Application Fee :
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
ICF Chennai Apprentice Selection Process : అకడమిక్ మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టైపెండ్
ICF Chennai Apprentice Salary : యాక్ట్ అప్రెంటీస్లకు నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://pb.icf.gov.in ఓపెన్ చేయాలి.
వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అప్పుడు మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
‘అప్లై ఆన్లైన్’ లింక్‌పై క్లిక్ చేసి, లాగిన్ కావాలి.
అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 మే 22
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జూన్ 21