నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. జబల్ పూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే.. డబ్య్లూ సీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్ లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?
మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఏకంగా 3317 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్ తదితర ట్రేడుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 15-24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. టెన్త్, ఇంటర్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం అప్రెంటిస్ పోస్టులు:
3,317
ట్రేడులు:
ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనో గ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్ మ్యాన్.
అర్హత:
అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.
వయోపరిమితి:
15-24 ఏళ్లు వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
టెన్త్, ఇంటర్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ. 41 చెల్లించాలి. మిగతా వారు రూ. 141 చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
05-08-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
04-09-2024