25 వేల బడ్జెట్ లో 50 ఇంచ్ Smart Tv డీల్స్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్స్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు చాలా చవక ధరకు లభిస్తున్నాయి
25 వేల బడ్జెట్ లో 50 ఇంచ్ Smart Tv డీల్స్ సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేస్తాము. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్స్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ ఫామ్స్ అందిస్తున్న డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కొన్ని 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు చాలా చవక ధరకు లభిస్తున్నాయి. వాటిలో రెండు బెస్ట్ డీల్స్ ను ప్రస్తావిస్తున్నాను.
Flipkart Sale 50 ఇంచ్ Smart Tv ఆఫర్
ఫ్లిప్ కార్ట్ వాలెంటైన్స్ సేల్ నుంచి ఈరోజు Thomson OP MAX 50 ఇంచ్ స్మార్ట్ టీవీని 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 12 నెలల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 23,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 50 ఇంచ్ LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 2GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది.ఈ ఫోన్ లో 40W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
Amazon Sale 50 ఇంచ్ Smart Tv ఆఫర్
అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ నుంచి Kodak Matrix Series 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,599 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి IDFC FIRST, Federal మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అం అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ క్యూలెడ్ టీవీ కేవలం రూ. 25,099 రూపాయల ధరకే లభిస్తుంది.
ఈ కోడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు AMO టెక్నాలాజి తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన 40W బాక్స్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.