పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ.. బయటపడ్డ 500 కోట్ల HIBOX స్కామ్

www.mannamweb.com


దేశంలో ఆన్‌లైన్‌ స్కామ్‌లు ఘోరాతి ఘోరంగా పెరిగిపోతున్నాయి. చాపాకింద నీరులా దేశం నలుమూలాల ఈ స్కామ్స్ వ్యాపిస్తున్నాయి. ఆ రకంగా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ మంచి పనులకేమో కానీ చెడ్డ పనులకు అస్త్రంగా మారింది. మోసగాళ్లు చాలా సునాయసంగా మోసం చేస్తున్నారు. సామాన్యులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించాలని చాలా స్కాముల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం కొన్ని యాప్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటిలో పడి ఘోరంగా మోసపోతున్నారు. తక్కువ ఇన్వెస్ట్ చెయ్యండి, ఎక్కువ ప్రాఫిట్స్ పొందండి. అని కొన్ని యాప్స్ డబ్బుల ఆశలు చూపిస్తున్నాయి. చివరకు సామాన్యులను నట్టేట ముంచేస్తున్నాయి. రీసెంట్ గా హైబాక్స్‌ (HIBOX) మొబైల్ యాప్‌ అనే స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అసలు ఈ స్కామ్ ఏంటి? ఈ హై బాక్స్ యాప్ ఏంటి? దీని వెనకాల ఉన్నది ఎవరు? ప్రజలు ఈ స్కామ్ లో పడి ఎలా మోసపోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ హైబాక్స్ యాప్ ని వాడుకొని స్కామర్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు కాజేసి మాయమైపోయారు. ఈ భారీ స్కామ్‌ వెనకాల పలు బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో పాపులర్‌ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, కమెడియన్ భారతీ సింగ్ ఉన్నారు. అలాగే సౌరవ్ జోషి, అభిషేక్ మల్హన్, పురవ్ ఝా, హార్ష్‌ లింబాచియా, లక్షయ్ చౌదరి, ఆదర్శ్ సింగ్, అమిత్, దిల్‌రాజ్ సింగ్ రావత్ వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్ళకి ఢిల్లీ పోలీసులు సమన్లు ​​కూడా జారీ చేశారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది. ఈ యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారికి ఎక్కువ రిటర్న్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారు యాప్‌ నిర్వాహకులు. దాంతో వీరు ప్రజల నుంచి ఏకంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసి దారుణంగా మోసం చేశారు. హైబాక్స్‌ స్కామ్ ని పక్కాగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారని డిప్యూటీ కమిషనర్ హేమంత్ తివారీ తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు హైబాక్స్‌ను బాగా ప్రమోట్ చేశారు. ఇందులో ఇన్వెస్ట్ చేయమని తమ ఫాలోవర్స్‌ కి నమ్మకం కలిగించారు. దాంతో నమ్మి మోసపోయిన వారు దీనిపై కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 500 కంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో ఈ స్కామ్‌పై పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. హైబాక్స్ ద్వారా మోసపోయామని ఆగస్టు 16న 29 మంది ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు. బాధితులకు రోజూ 1% నుంచి 5%, నెలకు 30% నుంచి 90% వరకు రిటర్న్స్‌ ఇస్తామని యాప్‌ మ్యానేజర్స్ హామీ ఇచ్చారట.

అసలు ఈ స్కామ్ ని వెనుక నుండి నడిపిస్తుంది చెన్నైకి చెందిన 30 ఏళ్ల శివరామ్ అనే వ్యక్తి. అతను 2024 ఫిబ్రవరిలో HIBOX యాప్‌ను స్టార్ట్ చేశాడు. ఈ యాప్ మొదట్లో జనాలను బాగానే నమ్మించింది. ఇన్వెస్టర్లకు ఎక్కువ రిటర్న్స్ అందించింది. దీంతో ఎక్కువ మంది ఇందులో డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. కానీ జులై నాటికి, యాప్ నుంచి పేమెంట్స్ చేయడం ఆపేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌, చట్టపరమైన సవాళ్లు, జీఎస్టీ కాంప్లికేషన్స్‌ వల్ల పేమెంట్లు చేయలేకపోతున్నట్లు నిర్వాహకులు సాకులు చెప్పారట. ఆ తర్వాత హైబాక్స్‌ వెనుక ఉన్న స్కామార్లు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఆఫీస్ ని క్లోస్ చేసి పారిపోయారని DCP తివారీ తెలిపారు.ఈ స్కామ్‌లో పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిక్కుకున్నాయి. EASEBUZZ, PhonePe లని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. హైబాక్స్‌ యాప్‌లో ట్రాన్సాక్ష‌న్‌స్ జరపడానికి వీటిని వాడారట. ట్రాన్సాక్షన్లకు అనుమతించే ముందు ఈ కంపెనీలు యాప్‌ను సరిగ్గా వెరిఫై చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులు ప్రస్తుతం 127 కంప్లైంట్ లను తీసుకున్నారు. ఈ పేమెంట్‌ యాప్ లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ని అతిక్రమించాయా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదీ సంగతి. ఈజీగా డబ్బులు కావాలని ఇలాంటి యాప్ లని వాడకండి.