జనవరి 1న అన్ని పాఠశాలలకు ఆప్షనల్ సెలవు…
- ఎస్ టీ యు రాష్ట్ర నాయకులు
Optional holiday | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన ఆప్షనల్ హాలిడే(Optional holiday) గా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం చేసింది అని ఎస్టి యు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథరెడ్డి, సోమేసుల చంద్రశేఖర్, అజాం బెగ్లు ఈ రోజు తెలిపారు.
శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ రాజశేఖర్‌లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తారీఖున అన్ని యాజమాన్య పాఠశాలలకు పూర్తిగా ఆప్షనల్ హాలిడేగా వాడుకునే విధంగా ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు(orders) జారీ చేశారు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో చర్చించారు. వారు అధికారులతో మాట్లాడుతూ… నిర్ణయిస్తాం అని చెప్పిన గంటలోపు నిర్ణయం ప్రకటించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఆప్షనల్ హాలిడేస్ -2026 మేరకు ముస్లిమ్స్(Muslims) కి 10 ఆప్షనల్ హాలిడేస్ గాను, క్రిస్టియన్స్ కి 5 ఆప్షనల్ హాలిడేస్ గాను, హిందువులకి 5 ఆప్షనల్ హాలిడేస్ గా నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యం పాఠశాలలో కార్యాలయాలు ఆప్షనల్ హాలిడేస్ ను ఉపయోగించుకునే విధంగా నిర్ణయించారు.


































