రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో లావా స్మార్ట్‌ఫోన్‌

లావా నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌ లో లావా అగ్ని 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అగ్ని 3 5G ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా అందుబాటులోకి వచ్చింది.


అయితే తాజాగా కొత్త ఫోన్ టీజర్‌ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ రెండు డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని పోస్టర్‌ ఆధారంగా తెలిసింది. షియోమీ 17 ప్రో, షియోమీ 17 ప్రో మ్యాక్స్‌ కూడా ఇదే తరహా డిజైన్‌ ను కలిగి ఉంది.

ఈ పేరుతోనే లాంచ్‌ కానుందా? :

లావా ఇప్పటికే డ్యూయల్‌ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లావా బ్లేజ్‌ డుయో 5G, లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రైమరీ, ఇన్‌స్టా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అయితే లావా నుంచి త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్‌ డుయో 3 5G పేరుతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? :

లావా బ్లేజ్‌ డుయో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో రూ.16999 ధరకు విడుదల అయింది. అయితే లావా బ్లేజ్‌ డుయో 3 5G (Lava Blaze Duo 3 5G Smartphone) (ఈ పేరును లావా ధ్రువీకరించలేదు) ఫోన్‌ రూ.20000 ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

50MP ప్రైమరీ కెమెరా :

లావా నుంచి త్వరలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌! :

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌ 6GB LPDDR5 ర్యామ్‌, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

రెండు డిస్‌ప్లేలతో లాంచ్‌ :

లావా ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెనుక వైపు 1.6 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ లు సహా అనేక విధాలుగా వెనుక వైపు ఉన్న డిస్‌ప్లే ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :

ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ 7.55mm థిక్‌నెస్‌ తో స్లిమ్‌ డిజైన్‌, 181 గ్రాముల బరువును కలిగి ఉండే అవకాశం ఉంది.

లావా నుంచి త్వరలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ ఏ పేరులో అందుబాటులోకి వస్తుందో లావా అధికారికంగా విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను కూడా వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.