మహిళా పోలీస్‌ ఫ్రాంచైజ్‌.. ‘మర్దానీ 3’ వచ్చేస్తోంది

రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “మర్దానీ 3”. దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్‌ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది.


ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్‌ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్‌ను ఓ నెల ముందుకు జరిపారు.

సినిమా
మర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్‌ డెవిల్‌ పోలీస్‌ శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. ‘ద రైల్వేమెన్‌’ ఫేమ్‌ ఆయుష్‌ గుప్తా కథ అందించాడు. అభిరాజ్‌ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.