పీఎఫ్ ఖాతా కలిగిన ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. ఒకేసారి అకౌంట్లలోకి రూ. 46 వేలు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
ఉద్యోగులకు తీపికబురు. పీఎఫ్ ఖాతా కలిగిన వారికి అదిరే గుడ్ న్యూస్. ఒకేసారి అకౌంట్లోకి రూ.46 వేలు జమ కానున్నాయి. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో- EPFO) నుండి పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ రూపంలో అదనపు ప్రయోజనం లభించనుంది. మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా దాదాపు రూ. 46,000 వరకు అదనంగా మీ ఖాతాలో జమ కావొచ్చు.
ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం సభ్యుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ చేస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును ప్రకటిస్తుంది. మీ ఖాతాలో డబ్బుల ఆధారంగా, ఈ వడ్డీ మొత్తం చాలా మంది చందాదారులకు సుమారు రూ. 46,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో అదనపు పొదుపుగా జమ అవుతుంది. పీఎఫ్ ఖాతాలోని డబ్బులు ఆధారంగా వచ్చే వడ్డీ మారుతుంది.
ఈపీఎఫ్ పథకంలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరూ ఈ వడ్డీకి అర్హులు. కంపెనీల ద్వారా క్రమం తప్పకుండా పీఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తున్న ఉద్యోగులు ఈ ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగం వదిలేసినా, పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకోకుండా ఉన్న వారు కూడా ఈ ప్రయోజనం పొందొచ్చు.
ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్నవారు (మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోనంత వరకు) ఈ వడ్డీ రాబడి సొంతం చేసుకోవచ్చు. మీరు రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు లేదంటే పూర్తి మొత్తాన్ని తీసుకునే వరకు మీ పీఎఫ్ డబ్బుపై వడ్డీ లభిస్తూనే ఉంటుందని గుర్తించుకోవాలి.
ఈ క్రమంలో పీఎఫ్ వడ్డీని ఎలా చెక్ చేసుకోవాలి? అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఖాతాలో ఎంత వడ్డీ జమ అయిందో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది. దీని కోసమ మీరు ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్‌కు వెళ్లాలి. అంటే అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
మీ UAN యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ‘Passbook’ లేదా ‘Balance’ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు, తాజా ఆర్థిక సంవత్సరానికి గాను జమ అయిన వడ్డీని మీరు చూడవచ్చు.
అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీ యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారినట్లయితే, పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవడం వల్ల వడ్డీ నష్టపోకుండా ఉండొచ్చు. ఇంకా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు తమ బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. కాగా మీ పీఎఫ్ అకౌంట్‌లో రూ. 5 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉంటే రూ. 40 వేలకు పైగా వడ్డీ పొందటం వీలవుతుందని గమనించాలి.



































