నైరుతి బంగళాఖాతంలో ఉన్న వాయుగుండం.. మంగళవారం సాయంత్రం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమరావతి వాతావరణకేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు – ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు.
రానున్న 12 గంటల వరకూ దీని ప్రభావం కొనసాగుతుందని, ఆ తర్వాతి 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేశారు. వాయుగుండం కేంద్రం ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలకు 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీని ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావణ అధికారులు తెలిపారు.



































