శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్.. ధర వివరాలు

శాంసంగ్ గెలాక్సీ A07 4G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇప్పటికే విడుదల అయింది. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్ 5G వేరియంట్‌ త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.


అయితే గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో విడుదలపై శాంసంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

కీలక వివరాలు లీక్‌ :

గ్లోబల్‌ మార్కెట్‌ లో గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని ఆధారంగా భారత్‌ వేరియంట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కొంత వరకు అంచనా వేయవచ్చు. ఈ ఫోన్ ఇండియా వేరియంట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ One UI 8.0 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలుస్తోంది. సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా :

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌ ఉంటాయని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

6000mAh బ్యాటరీ, IP54 రేటింగ్‌ :

ఈ హ్యాండ్‌సెట్‌ 25W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8.2mm థిక్‌నెస్‌ తో 199 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ లైట్‌ వైలెట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది.

ధర అంచనా వివరాలు :

శాంసంగ్‌ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ లీక్‌ చేశారు. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15999 గా ఉంటుందని అంచనా వేశారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 ఉంటుందని చెబుతున్నారు.

* శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ ఫోన్‌ చైనా సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌ TENAA లో లిస్టింగ్‌ అయింది. అయితే శాంసంగ్‌ మాత్రం ఈ ఫోన్ విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ లో గెలాక్సీ S26 సిరీస్‌ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.