ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత

వరుస విషాదాలతో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒక్కరొక్కరిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. గత కొద్ది రోజులగా చాలామంది సడెన్‌గా గుండెపోటుతో మరణిస్తుంటే..


మరికొందరు అనారోగ్య సమస్యలు తలెత్తి ఆదుకునే వాళ్ళు లేక కొందరు చనిపోతున్నారు. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ హీరో అభినయ్ కింగర్(Abhinay Kingar) తుదిశ్వాస విడిచాడు. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం (నవంబర్10)న ప్రాణాలు కొల్పోయారు. ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. అరుముగ్, ఆరోహణం, సక్సెస్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన చివరగా ‘వల్ల వణుక్కు పుల్లం ఆయుధం’ (Vallavanukku Pullum Aayudham)చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయి తన అనారోగ్యానికి చికిత్స తీసుకున్నారు. ఇక ఇటీవల తన మరణాన్ని అంచనా వేస్తూ ఓ వీడియో కూడా షేర్ చేశాడు. అందులో ఏడాదిన్నర మాత్రమే బుతుకుతానని డాక్టర్లు చెప్పారని చెప్పాడు. ఈ వీడియో వచ్చిన మూడు నెలలకే మరణించడం గమనార్హం. ఆరోగ్యం క్షీణించడం వల్లే ప్రాణాలు కోల్పోయాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.