సృష్టిలో అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి జీవి తన పిల్లల కోసం ఎంతో తపన పడుతుంది. మనుషులు మాత్రమే కాదు పశుపక్షాదులు కూడా తమ పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతారు. తమ ప్రాణాలు సైతం ఫణంగా పెడతారు. ముఖ్యంగా తల్లి అయితే తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా వెరవరు. మాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే ఓ మహిళ అమ్మదనానికే మచ్చ తెచ్చింది. అప్పుడే పుట్టిన నవజాత శిశివుని తన చేతులతో చంపేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ పోలీసుల అదుపులో ఉంది.
తల్లిబిడ్డల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ప్రాణం కంటే పిల్లలంటేనే ఎక్కువ మక్కువ అని చెబుతుంది తల్లి. తన బిడ్డకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే తన ప్రాణాలను కూడా పణంగా పెడుతుందని అంటారు. అదే తల్లి దారుణమైన ఆలోచన చేసింది. ఆ మహిళలో క్రూరత్వం సరిహద్దులు దాటింది. సభ్య సమాజం సిగ్గు పడే విధంగా తన కన్నపిల్లను తనే స్వయంగా చంపేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత.. ఆ మహిళ చేసిన పనికి షాక్ తింటున్నారు. ఓ తల్లి నవ మాసాలు మోసి కన్న తన శిశివుకి జన్మనిచ్చిన వెంటనే చంపేసింది!
ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురితమైన నివేదికల ప్రకారం.. దక్షిణ కరోలినాలోని పోలీసు అధికారులు భయంకరంగా మరణించిన నవజాత శిశువుని కనుగొన్నారు. పిల్లని చంపేసిన తల్లిని అదుపులో తీసుకున్నారు. గత శుక్రవారం ఈస్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇటీవల ప్రసవించిన ఒక మహిళకు ఎమర్జెన్సిగా వైద్యం అందించాలంటూ అత్యవసర పరిస్థితి గురించి 911 కాల్ అందిందని తెలిపింది. పోలీసులు , పికెన్స్ కౌంటీ EMS రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నారు.
ఎందుకంటే ఆ మహిళ అప్పుడే పుట్టిన తన బిడ్డను ఓపెనర్‌తో చంపేసింది. ఆపై చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి.. మరొక గదిలో విసిరివేసిందని ఆరోపించారు. వైద్య చికిత్స కోసం ఎన్గోను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆమె బాండ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఎవరైనా సరే తమ సొంత బిడ్డ చేతులారా ప్రాణం తీసేటంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడని… అది కూడా తల్లి ఎలా ఇలా చేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళ ముఖంలో ఎక్కడా తల్లి అయిన ఆనందం కనిపించలేదని అంటున్నారు. పైగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళ విచారంగా కనిపించింది. ముఖంలో ఏదో కోపం కనిపించింది. మహిళ బొడ్డు తాడును కత్తిరించిన తర్వాత పొడవైన లెటర్ ఓపెనర్‌తో శిశివుపై దాడి చేసింది. ఈ దాడి జరిగిన వెంటనే ఆ చిన్నారి మరణించింది. తరువాత ఆ మహిళ బిడ్డను ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి వేరే గది వైపు విసిరేసిందని చెప్పారు.
ఈ కేసు గురించి ఆ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. తాను గత 25 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నానని.. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనను గురించి ఎప్పుడూ వినలేదని, చూడలేదని అన్నారు. అందుకే ఆ మహిళపై పిల్లలపై వేధింపులు, హత్య ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ మే 15న కోర్టులో జరగనుంది. దీనికి సంబంధించిన ఒక నివేదిక మిర్రర్ యుఎస్‌లో వచ్చింది,