కఠోర శ్రమ, అంకితభావం, అదృష్టం ఉంటే ప్రతి మనిషికి జీవితంలో ఆశించిన ఫలితాలు వస్తుంటాయి. ఇలాంటి ఘటనలో భారత్‌లు ఎన్నో జరిగాయి. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ టీ అమ్మే బాలుడి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కోని భారత ప్రధానిగా ఎదిగారు.
అలాగే పేపర్ బాయ్ గా పని చేసిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా ఎదిగిన సందర్భం భారత్ లోనే జరిగింది.
ఇలాంటి పరిణామమే మరోకటి చోటు చేసుకుంది. మిజోరాం కు చెందిన ఓ టీవీ యాంకర్ ఎన్నికల్లో గెలుపొంది.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగింది. అంతే కాదు తమ రాష్ట్ర చరిత్రలో మొదటి సారి ఓ మహిళా అభ్యర్థి స్పీకర్ గా అయిన ఘనత కూడా బారిల్ వన్నేహా సాంగ్ కే దక్కింది. మొదట చిన్న చానెల్ యాంకర్ నుంచి టీవీ యాంకర్, ఆ తర్వాత సోసల్ మీడియాలో ఇన్ ఫ్లేయెన్సర్ గా ఎదిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజాల్ సౌత్ 3 నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా.. 33 ఏళ్ల వయస్సులోనే మిజోరం లో యువ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మొట్టమొదటి మహిళా స్పీకర్ గా బారిల్ వన్నేహా సాంగ్ చరిత్రలోకి ఎక్కింది.