బొద్దింకలు ఇంట్లోకి రాకుండా చేసే పవర్ ఫుల్ ఐడియా.

మీ ఇంట్లోనూ బొద్దింకల బెడద ఉందా.. అవి రాత్రంతా వంటగదిలో తిరుగుతూ మీకు చికాకు తెప్పిస్తున్నాయా? అయితే ఈ వార్త మీకోసమే.. మీరు మొదట బొద్దింకలను తరిమేడం కాదు..


అవి ఇంట్లోకి రాకుండా ఏం చేయాలో తెలుసుకోవాలి.. అలా చేస్తే.. అసలు వాటి బాదే ఉండదు కదా. అందు ఏం చేయాలో ఇక్కడ చూద్దాం పదండి.

సాధారణంగా బొద్దింకలు వంటగది సింక్ కింద, అల్మారాలు మొదలైన వాటిలోంచి రావడం మనం గమనించవచ్చు. అలా వచ్చిన బొద్దింకలు అక్కడే స్థవరాలను ఏర్పరుచుకొని.. ఇంటినంతా నాశనం చేస్తాయి.

అలాంటప్పుడు మీరు వాటిని ఆ ప్రాంతలో ప్రవేశించకుండా చేయాలి.. ఒక వేళ ప్రవేశించినా.. అవి అక్కడే అంతమయ్యేలా చూసుకోవాలి. ఇందుకోసం కొన్ని బే ఆకులను తీసుకొని వాటిని చేతులతో బాగా నలిపి అవి ప్రవేశించే దగ్గర ఉంచండి.

అలాగే ఇంకొన్ని ఆకులు తీసుకొని వాటిని కొద్దిగా చూర్ణంలా చేసి.. ఆ పొడిని ఆచుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా చిలకరించండి. అలాక్కడే వంటగది ప్రవేశాల వద్ద కూడా కొంచెం వేయడం. ఇలా చేయడం ద్వారా అవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.

ఎందుకంటే బే ఆకులు బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వాటిని వాసన బొద్దింకలకు చికాకు పుట్టిస్తుంది. అలాగే ఆ ప్రాంతాల్లో తిరిగేందుకు అవి ఇష్టపడవు.. ఒక వేల అటుగా వచ్చినా.. ఈ వాసనకు అవి తిరిగి వెళ్లిపోతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.