నోకియా నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఇది ఇంట్లో ఉంటే థియేటర్ అవసరం లేదు

నోకియా కంపెనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్లే కాదు, క్రేజీ స్మార్ట్ టీవీలను కూడా పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే 50 ఇంచుల QLED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.


ఇది QLED ప్యానెల్‌ తో 4K రెజల్యూషన్, డాల్బీ ఆట్మాస్ సౌండ్, ఆండ్రాయిడ్ OSతో వస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్, సహా ఆఫ్‌ లైన్ స్టోర్లలోలభిస్తుంది. ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. ప్రస్తుతం వీటి ధర రూ. 49,999 నుంచి ఊ. 69,999 వరకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్లతో లభిస్తుంది.

Nokia QLED Smart TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

⦿ స్క్రీన్ సైజు: నోకియా QLED Smart TV 50 ఇంచుల(127 cm)తో వస్తుంది. QLED ప్యానెల్ ను కలిగి ఉంటుంది. 4K UHD (3840 x 2160 పిక్సెల్స్)తో వస్తుంది.

⦿ రిఫ్రెష్ రేట్: ఈ స్మార్ట్ టీవీ 60 Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. MEMC టెక్నాలజీతో స్మూత్ మోషన్ తో వస్తుంది.

⦿ ఆడియో: ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లును కలిగి ఉంటుంది. JBL సౌండ్, Harman AudioEFX, 360° సరౌండ్ సౌండ్, డాల్బీ ఆట్మాస్, 60W+ ఔట్‌ పుట్ ను కలిగి ఉంటుంది.

⦿ స్మార్ట్ ఫీచర్లు: Android 11, Google Assistant, Chromecast, Netflix/Prime/YouTube హాట్‌ కీలు, FastCast అప్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది.

⦿ కనెక్టివిటీ: 3 HDMI (ఒకటి eARC), 2 USB, Dual Band Wi-Fi (2.4/5 GHz), Bluetooth 5.0, Ethernetతో వస్తుంది.

⦿ HDR సపోర్ట్: Dolby Vision, HDR10, HLG వైడ్ కలర్ గాముట్ (WCG), ఇంటెలిజెంట్ డిమ్మింగ్ ను కలిగి ఉంటుంది.

⦿ ప్రాసెసర్: Quad-Core, 2 GB RAM, 16 GB స్టోరేజ్తో వస్తుంది.

డివైజ్ బెజెల్-లెస్, వాల్ మౌంట్ సపోర్ట్, రిమోట్ వాయిస్ కంట్రోల్‌ తో వస్తుంది. ఈ టీవీ 4K స్ట్రీమింగ్‌కు ఐడియల్, QLED టెక్నాలజీతో కలర్స్ వైబ్రెంట్‌ గా, బ్లాక్స్ డీప్‌ గా ఉంటాయి. గేమింగ్/మూవీస్‌కు అనుకూలంగా ఉంటుంది.

Nokia QLED Smart TV ధర ధరలు:

⦿ఫ్లిప్‌ కార్ట్: ₹49,999 (డిస్కౌంట్‌, EMI ఆప్షన్లు)

⦿ అమెజాన్/స్మార్ట్‌ ప్రిక్స్: ₹59,999 – ₹69,999

⦿ ఆఫ్‌ లైన్ (హైదరాబాద్): ₹55,000 – ₹65,000

Nokia QLED Smart TV ఎలా కొనాలి?

⦿ ఆన్‌లైన్: ఫ్లిప్‌కార్ట్/అమెజాన్: తెలంగాణలో 2-3 రోజుల డెలివరీ అందిస్తుంది.

⦿ ఆఫ్‌ లైన్: హైదరాబాద్‌లో Croma/Reliance Digitalలో అందుబాటులో ఉన్నాయి.

⦿ తెలంగాణలో డెలివరీ/ఇన్‌స్టాలేషన్ ఫ్రీ. ఏడాది పాటు వ్యారంటీ లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.