98 అడుగుల ఎత్తులో సునామీ వస్తుంది, రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు, అంచనాలతో ఆందోళన

జపాన్‌లోని హొక్కైడో సమీపంలో సముద్రంలో ‘మెగాక్వేక్’ సంభవిస్తే 2 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒక అంచనా.


98 అడుగుల ఎత్తులో సునామీ ఏర్పడవచ్చు మరియు 2,20,000 భవనాలు ధ్వంసం కావచ్చునని నిపుణులు తెలిపారు.

సుమారు 19,800 కోట్ల డాలర్ల నష్టం కూడా జరగవచ్చని అంచనాలు ఉన్నాయి.

మంగళవారం రోజున జపాన్ వాతావరణ సంస్థ మొదటిసారిగా దేశంలో మెగాక్వేక్ హెచ్చరికను విడుదల చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే బలమైన భూకంపాలను మెగాక్వేక్‌లు అంటారు. ఈ వారంలో హొక్కైడో సమీపంలో సముద్రంలో మెగాక్వేక్ సంభవించే అవకాశం ఉందని మరియు పసిఫిక్ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంస్థ చెబుతోంది.

అయితే, భయపడాల్సిన అవసరం లేదని సంస్థ పునరుద్ఘాటించింది. ఇదే ప్రాంతంలో సోమవారం 7.5 రిక్టర్ స్కేల్ తీవ్రతతో సంభవించిన భూకంపం 70 సెంటీమీటర్ల వరకు ఎత్తులో సునామీ అలలకు దారితీసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.