ప్రచురణార్ధం తేదీ : 20/7/24
టోఫెల్ విధానాన్ని రద్దు చేయండి – తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం
ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న టోఫెల్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మూడో తరగ తిలో ఐఐటీ బోధన ఎంత అసంబద్ధమో టోఫెల్ విధానమూ అంతేనని వివరించారు. తూతూ మంత్రంగా వాట్సప్ లో టోఫెల్ విధానం లో పదాలు పంపడం వాటిని ఫోన్ ద్వారా పిల్లలకు వినిపించడం అంతా ఒక నిరూపయోగ ప్రక్రియ అని ఈ విధానాన్ని రద్దు చేయడమే ఉత్తమమన్నారు. ప్లస్ టూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యా బలంలేని వాటిని సమీక్షించాలని సూచించారు. జీవో 117, మరియు పాఠశాల లలో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో బోధన పై త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.