వాస్తు ప్రకారం.. ఇంట్లో రోజూ పాలు పొంగుతున్నాయంటే దానర్థం.

క్ష్మీదేవి అనుగ్రహం, ధన సంపదల ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల పూజలు, ప్రీతికరమైన పనులు చేస్తుంటారు. ఎంత కష్టపడినా ఆర్థిక విజయం, ప్రగతి లభించకపోవడానికి కారణం లక్ష్మీదేవి అసంతృప్తే అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.


తెలిసి లేదా తెలియక మనం చేసే కొన్ని తప్పులు, అలవాట్ల వల్ల ఆమె కోపగించుకుని దరిద్రం, అశాంతి, ఆర్థిక సమస్యలను సృష్టిస్తుందని నమ్ముతారు.

లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ఈ పద్ధతులు పాటించవచ్చు..

శనివారం నాడు నల్ల కుక్కకు నూనె రాసిన బ్రెడ్ లేదా రొట్టె తినిపించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. బుధవారం పేద పిల్లలకు ఆకుపచ్చ పెసరపప్పు దానం చేయాలి. అమావాస్య రాత్రి రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం శుభకరం. ఇంట్లో ఉత్తర దిశలో అక్వేరియం ఏర్పాటు చేసుకోవడం మంచిది.

లక్ష్మీదేవి ఆగ్రహించిందని సూచించే కొన్ని సూచనలు..

ఇంట్లో పదేపదే పాలు పొంగిపోవడం, తరచుగా డబ్బు లేదా సంచులను పోగొట్టుకోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు పదేపదే చెడిపోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి. చెడు ఆలోచనలపై ఆసక్తి పెరగడం, దుష్ట అలవాట్లకు బానిసలు కావడాన్ని దరిద్రానికి దారితీసే లక్షణాలుగా పరిగణిస్తారు.

ఇంట్లో వస్తువులను తప్పు దిక్కులలో ఉంచడం కూడా అనవసరమైన ఖర్చులు పెంచుతుంది. గోడ గడియారాన్ని దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచితే అది మనకు సమయం కలిసి రాదని సూచిస్తుంది. సరైన దిశలో ఉన్న గడియారం పురోగతిని తెస్తుంది. తప్పుడు దిశలోనిది ఆలస్యం, నష్టాలను కలిగిస్తుంది. ఇంటి నైరుతి దిశలో చెట్లను పెంచడం పేదరికం, కుటుంబ కలహాలు ఆహ్వానించినట్టే.

ఇల్లు లేదా కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలను తూర్పు, ఆగ్నేయం లేదా పశ్చిమ-వాయువ్య దిశలలో అమర్చడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రదేశాల్లో కెమెరాలు ఉంచడం అరిష్టంగా భావిస్తారు. అబద్ధాలు చెప్పడం, చిన్న విషయాలకే గొడవపడటం, పదేపదే ఇతరుల నుండి అప్పులు తీసుకోవడం, అలాగే ఇతరుల వస్తువులను ఉచితంగా స్వీకరించడం వంటివి ఆర్థిక కష్టాలకు కారణమవుతాయి.

దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి, ఆర్థిక సమస్యల నివారణకు ఈ మంత్రాలను పఠించడం మంచిది: ప్రతిరోజూ “ఓం రాం రాహవే నమః” మంత్రాన్ని జపించాలి. శని దోషాల నుండి ముక్తి కోసం “ఓం శం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని పఠించండి. ఎల్లప్పుడూ నుదుటిపై చందనం తిలకం ధరించండి. “మహాలక్ష్మీ చ విద్మహే | విష్ణుపత్నీ చ ధీమహి | తన్నో లక్ష్మీః ప్రచోదయాత్” అనే లక్ష్మీ మంత్రాన్ని పఠించడం కూడా శుభం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.