స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్ విసిగిస్తున్నాయా? ఇలా చేస్తే ఒక్క యాడ్ కూడా కనిపించదు

www.mannamweb.com


స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ (Adds) విసిగిస్తున్నాయా? ఎన్నిసార్లు స్కిప్ చేస్తున్నా మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయా? నిజానికి ఆపిల్ ఐఫోన్ లో ఈ యాడ్స్ కనిపించే అవకాశం ఉండదు కానీ ఆండ్రాయిడ్ మొబైల్ లో యాడ్స్ కనిపించి విసిగిస్తూ ఉంటాయి.

ఇలాంటి అప్పుడు యాడ్స్ ను ఆపేయటానికి కొన్ని సెట్టింగ్స్ ను మార్చుకుంటే చాలు. ఇకపై ఇలాంటి సమస్య ఉండదు. ఫోన్లో యాడ్స్ ను సరైన పద్ధతిలో ఆపేయగలిగితే మళ్ళీ విసిగించే అవకాశం ఉండదు. అయితే ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవల్సి ఉంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్‌కి రకరకాల యాప్స్ కు సంబంధించిన ప్రకటనలు వస్తూనే ఉంటాయి. చాలా యాప్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు అనవసరంగా విసిగించే కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి తెలియకుండానే సమయాన్ని వృథా చేస్తాయి. ఇక ఈ ప్రకటనలు తరచుగా ఇబ్బంది పెట్టి చేసే పనికి ఆటంకం కలిగిస్తాయి. ఈ ప్రకటనల పదే పదే పాప్ అప్‌ల కారణంగా ఫోన్ బ్యాటరీ, డేటా కూడా వేగంగా అయిపోయాయి. నిజానికి యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎలా ఆపేయాలో తెలియనప్పుడు యాడ్ మొత్తం చూసి క్రాస్ ఆప్షన్ పై క్లిక్ చేయడం తప్పా వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ఇలా ఇబ్బంది పడే వారి కోసం కచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రకటనలతో ఇబ్బంది పడుతుంటే వాటిని ఆఫ్ చేయాలనుకుంటే ఈ కథనం మీ కోసమే. స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే యాప్‌ల ప్రకటనలను ఆఫ్ చేయడానికి సులభమైన మార్గాలు కొన్ని ఉన్నాయి.

యాడ్స్ ను ఎలా ఆఫ్ చేయాలి –

⦿ ఫోన్‌లో ప్రకటనలను ఆఫ్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ సహాయం తీసుకోనవసరం లేదు. ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేస్తే చాలు

⦿ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చెయ్యాలి.

⦿ ఆ తర్వాత Google ఆప్షన్​పై క్లిక్​ చేయాలి

⦿ ఇప్పుడు Manage Your Google Account అనే దానిపై క్లిక్ చేయాలి

⦿ ఆ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే Data & Privacy ఆప్షన్ వస్తుంది.

⦿ ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసినప్పుడు Personalized Ads ఆప్షన్ కనిపిస్తుంది.

⦿ Personalized Ads కింద My Ad Center ఆప్షన్ ఉంటుంది.

⦿ దానిపై క్లిక్​ చేసి స్క్రీన్​​ పైన కుడివైపున ఉన్న Personalized Ads టోగుల్ ఆఫ్ చేయాలి.

⦿ ఆపై Settings ఓపెన్​ చేసి గూగూల్ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

⦿ Manage Your Google Account కు కిందన కనిపించే Services on this Device సెక్షన్​లో Ads ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

⦿ ఆపై Delete Advertising IDని ట్యాప్ చేసి డిలీట్ చేస్తే చాలు

⦿ ఇలా చేస్తే ఇకపై ఆండ్రాయిడ్​ ఫోన్లలో యాడ్స్ రాకుండా ఆగిపోతాయి.

ఇలా ఫోన్ కి వచ్చే అనవసరమైన యాడ్స్ ను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇకపై మీకూ అవసరం అనుకుంటే ఈ సెట్టింగ్స్ ను ఛేంజ్ చేసుకుంటే చాలు.