Almonds Benefits In Telugu :బాదం పప్పు తినటం వలన అందం ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ప్రతి రోజు నాలుగు బాదంపప్పులను తినటం వలన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.
బాదం తినని వారు కూడా ఈ వీడియో చూసి తినటం అలవాటు చేసుకుంటారు. బాదం పప్పులో విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ గుణాలున్న ఫ్లెవనాయిడ్లు,మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం,సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం,ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.
ఇన్ని పోషకాలు ఉన్నా బాదంను ప్రతి రోజు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన శరీరానికి అవసరమైన మంచి కొవ్వును పెంచి శరీరానికి హాని కలిగించే చెడు కొవ్వును తగ్గిస్తుంది. బాదంలో కాల్షియమ్, మేగ్నేషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు,దంతాలు బలంగా ఉంటాయి.
ఈ పోషకాలు లోపం కారణంగా ఆస్టియో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజు బాదం పప్పును తింటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు.బాదంలో విటమిన్ ‘E’ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ -ఆక్సిడెంట్’గా పనిచేసి సూర్యరశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని హైడ్రేడ్ గాను,మృదువుగాను ఉంచుతుంది.
బాదంలో విటమిన్ ‘D’ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండుట వలన అనేక రకాల కాస్మోటిక్స్ తయారీలలో వాడుతున్నారు. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది. అందువల్ల ప్రతి రోజు బాదం పప్పులను తినటం వలన జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.భోజనం చేయటానికి ముందు బాదం పప్పులను తినటం వలన బాదంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ ఆహారం తీసుకొనేలా చేస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.
గర్భిణీ స్త్రీలకు బాదాం చాలా బాగా సహాయాపడుతుంది. బాదంలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన ప్రసవ సమయంలో వచ్చే ఇబ్భందులను తగ్గిస్తుంది. అలాగే కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి బాగా సహాయాపడుతుంది.బాదంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదం తినేపుడు ఎక్కువగా నీరు తాగటం వల్ల, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది.
పేగుల కదలికలకు, సరిపోయే మోత్తంలో అంటే 4 బాదం తింటే సరిపోతుంది.బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత బాదంను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్నిపెంచుతుంది. తద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.