బజాజ్​ పల్సర్ మోడల్స్​పై అదిరిపోయే బెనిఫిట్స్​..

భారతీయ రోడ్లపై పల్సర్ ప్రస్థానానికి పాతికేళ్లు నిండాయి. ఈ సందర్భంగా బజాజ్ ఆటో తన కస్టమర్ల కోసం ప్రత్యేక యానివర్సరీ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై అనేక బెనిఫిట్స్​ పొందే అవకాశాన్ని కల్పించింది.

భారతదేశపు మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ ‘బజాజ్ పల్సర్’ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఇండియన్ మార్కెట్​లోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, బజాజ్ ఆటో తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై రూ. 7,000 వరకు బెనిఫిట్స్​ని అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


బజాజ్​ పల్సర్​ బైక్​- ఆఫర్లు ఏంటి?

ఈ వార్షికోత్సవ కానుకలో బజాజ్​ పల్సర్​ బైక్స్​పై కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

  • నేరుగా నగదు పొదుపు చేసుకునే అవకాశం.
  • ఫైనాన్స్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజు.
  • అదనంగా ఐదు ఉచిత సర్వీసులు.

ప్రస్తుతం ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్ని మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది పరిమిత కాలం మాత్రమే ఉంటుందని బజాజ్ స్పష్టం చేసింది.

బజాజ్​ పల్సర్​- 125సీసీ నుంచి 400సీసీ వరకు..

కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా 125సీసీ నుంచి 400సీసీ సామర్థ్యం వరకు ప్రస్తుతం మొత్తం 11 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్‌లో పల్సర్ 125 ఉండగా.. ఆ తర్వాత వరుసగా పల్సర్ ఎన్​150, పల్సర్ 150, పల్సర్ ఎన్​160 మోడళ్లు ఉన్నాయి. మరింత పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం పల్సర్ ఎన్​ఎస్​160, పల్సర్ ఎన్​ఎస్​200, ఫుల్లీ-ఫెయిర్డ్ లుక్ ఉన్న పల్సర్ ఆర్​ఎస్​200 సిద్ధంగా ఉన్నాయి.

ఇక 250సీసీ విభాగంలో పల్సర్ ఎన్​250 బైక్​, పల్సర్ ఎఫ్​250 ఉండగా.. ఈ సిరీస్‌లోనే అత్యంత శక్తివంతమైన మోడల్ పల్సర్ ఎన్​ఎస్​400జెడ్​ టాప్ వేరియంట్‌గా నిలుస్తోంది.

బజాజ్​ ప్లసర్​ పాతికేళ్ల ప్రస్థానం.. సరికొత్త రికార్డులు

“గడిచిన పాతికేళ్లలో భారతీయ స్పోర్ట్స్ బైక్ రంగంలో పల్సర్ ఒక విప్లవాన్నే సృష్టించింది. సామాన్యులకు కూడా స్పోర్టీ డిజైన్, హై-పెర్ఫార్మెన్స్‌ను చేరువ చేయడంలో పల్సర్ కీలక పాత్ర పోషించింది. డీటీఎస్​-ఐ వంటి అత్యాధునిక సాంకేతికతను ఆరంభంలోనే పరిచయం చేయడం ద్వారా ఈ బ్రాండ్ యువతకు ఫేవరెట్‌గా మారింది,” అని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

పల్సర్ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే అత్యంత పవర్‌ఫుల్ పల్సర్ ఎన్​ఎస్​400జెడ్​ని మార్కెట్​లోకి తెచ్చామని ఆయన తెలిపారు. కస్టమర్లకు విలువైన ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ఈ యానివర్సరీ ఆఫర్లను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

మీకు నచ్చిన పల్సర్ బైక్‌పై ఆఫర్ల వివరాలు తెలుసుకోవడం కోసం వెంటనే సమీపంలోని బజాజ్ షోరూమ్‌ని సంప్రదించండి. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందనేది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కాబట్టి త్వరపడటం ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.