ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) కొత్త ఏడాదిలో తొలి సేల్‌కు సిద్ధమైంది. జనవరి 13 నుంచి గ్రేట్ రిపబ్లిక్ సేల్ (Amazon Great Republic Day Sale) ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే.. అంటే అర్ధరాత్రి నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 19 వరకు ఈ సేల్ కొనసాగే అవకాశం ఉంది. అమెజాన్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
సేల్‌కు సంబంధించి అమెజాన్ ఇప్పటికే మైక్రోసైట్‌ను సిద్ధం చేసింది. ఇందులో కొన్ని ఆఫర్లను ప్రదర్శించింది. మరికొన్నింటిని టీజ్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, శాంసంగ్, రియల్‌మీ, రెడ్‌మీ మొబైల్స్‌పై డీల్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ నార్డ్4, సీఈ 4, నార్డ్ సీఈ4 లైట్ ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఎంతమేర డిస్కౌంట్ ఇచ్చేది వెల్లడించలేదు. అలాగే, నేడు లాంచ్ అవుతున్న వన్‌ప్లస్ 13, 13ఆర్ ఫోన్లు కూడా ఈ సేల్‌లోనే విక్రయానికి రానున్నాయి. అమెజాన్ అలెక్సా, ఫైర్‌టీవీ డివైజులపైనా ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించబోతున్నాయి. ఫైర్‌టీవీ స్టిక్ లైట్‌ను రూ.2599, ఎకో పాప్ రూ.3,949, ఎకో ఫోర్త్ జనరేషన్ రూ.7,549కి విక్రయించనున్నారు. ఇక స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ యాక్సెసరీస్, హోమ్ అప్లయెన్సెస్‌పైనా ఆఫర్లు ఉంటాయని అమెజాన్ చెబుతోంది. సేల్‌కు కొద్ది రోజుల ముందు ఆఫర్ల వివరాలు వెల్లడికానున్నాయి.