ఇందులో ఐకూ జెడ్ 10 ఆర్ పై అందించిన బిగ్ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్ సేల్ మొదలు కావడానికి ముందే ఈ డీల్ ను మీరు అందుకోవచ్చు.
iQOO Z10R 5G : ఆఫర్
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 11% డిస్కౌంట్ తో ఈరోజు అమెజాన్ నుంచి రూ. 20,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ ఫోన్ ను ICICI డెబిట్ / క్రెడిట్ కార్డ్ మరియు SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ . 18,999 ధరలో లభిస్తుంది. Buy From Here
iQOO Z10R 5G : ఫీచర్స్
iQOO Z10R 5G స్మార్ట్ ఫోన్ ఐకూ నుంచి వచ్చిన ఒక బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ 120Hz క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ వుంది. ఇది మంచి బ్రైట్‌నెస్ మరియు కలర్ క్వాలిటీ తో ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 (4nm) ప్రాసెసర్ మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజ్ మంచి మల్టీటాస్కింగ్ మరియు మంచి గేమింగ్ కోసం బాగుటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (Sony IMX882) OIS డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు బ్యాక్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో ఫోటోలు మరియు వీడియోలు క్లియర్‌గా వస్తాయి. అలాగే, ఈ ఫోన్ 5700 mAh బిగ్ బ్యాటరీ జతగా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇక డిజైన్ పరంగా ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు IP68 + IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి వుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. ఈ ఐకూ ఫోన్ Android 15 ఆధారంగా పనిచేసే Funtouch OS 15 తో వుంది. ఈ ఫోన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది.



































