Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో దుమారం.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు..

www.mannamweb.com


లోక్ సభ ఎన్నికలు ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఈ సమయంలో రిజర్వేషన్ల విషయంలో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్‌ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్‌ అవుతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఈ సమయంలో రిజర్వేషన్ల విషయంలో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్‌ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్‌ అవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం కలకలం రేపింది.. తెలంగాణలోని సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా.. బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతంచేశారు. తెలంగాణ కాంగ్రెస్ విభాగం వీడియోను వైరల్ చేసిందన్న ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్‌కి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 1న రేవంత్ విచారణకు రావాలని ఢిల్లీ పోలీసుల నోటీసుల్లో తెలిపారు. రిజర్వేషన్లు తొలగిస్తాం అన్నట్లు వీడియో వక్రీకరించారని అభియోగంపై రేవంత్ రెడ్డి తోపాటు.. పలువురు కాంగ్రెస్ నేతలకు సైతం ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గాంధీ భవన్ కు చేరుకున్న ఢి్లలీ పోలీసులు అమిత్ షా ఫేక్ వీడియో కేసులో.. సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కు నోటీసులు అందించారు.

అమిత్‌ మాలవీయ కీలక వ్యాఖ్యలు..
అయితే, తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్‌ వీడియోను ప్రచారం చేస్తోందని బీజేపీ IT విభాగం ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ను తొలగించడంపైనే అమిత్‌ షా మాట్లాడారనీ, కానీ రిజర్వేషన్లటినీ తొలగిస్తామని చెప్పలేదన్నారు. ఇలాంటి వీడియో సర్క్యులేట్‌ చేసినవారు న్యాయపరమైన పరిణామాలకు సిద్దం కావాలన్నారు.

దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ సైతం రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫేక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన వారి కోసం ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్ స్ట్రాటజిక్‌ ఆపరేషన్‌- IFSO అధికారులు వేట మొదలుపెట్టారు.