AP Elections: చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ.. జరగబోయేది ఇదేనట..!

www.mannamweb.com


Andhra Pradesh: అనంతపురంలోని(Anantapur) ధర్మవరంలో(Dharmavaram) బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. మీటింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో(Chandrababu Naidu) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి.. ప్రజల నాడి.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకశంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ, రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైనా వీరువురు చర్చించారు. అయితే, ఇదే భేటీలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా అమిత్ షా.. చంద్రబాబుతో చెప్పారట.

తమకు ఉన్న నివేదికల ప్రకారం.. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని చంద్రబాబుకు అమిత్ షా చెప్పారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుస్తుందని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నారని నివేదికలు పేర్కొన్నట్లు అమిత్ షా చెప్పారట. అలాగే.. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎండలను సైతం లెక్క చేయకుండా రోజుకు మూడు సభల్లో చంద్రబాబు పాల్గొనడాన్ని అమిత్ షా ప్రశంసించారు.