సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
అలాగే, ఆలస్యంగా వచ్చిన మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైల్ క్లియరెన్స్ వేగం పెంచాలని, గోదావరి పుష్కరాల దృష్ట్యా టెంపుల్ టూరిజం, ఆలయాల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ నివేదికను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

































