25 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 25 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు 27 మంది ఐపీఎస్, 25ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం తొలిసారి కావడం విశేషం.


రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కొద్దిసేపటికే 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే ఏపి స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్‌ను సీఎం ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రీ డిజిగ్నేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే హౌసింగ్ డిపార్టమెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ అజయ్ జైన్‌కు టూరిజం అండ్ కల్చరల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నబాబును సిఆర్డీఏ కమీషనర్‌గా నియమించారు.జి వీరపాండ్యన్‌ను వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ఎంఎం నాయక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే
1. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి- జి.సాయిప్రసాద్
2. హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ,టూరిజం అండ్ కల్చర్ శాఖ అదనం-అజయ్ జైన్
3.ఏహెచ్‌డీడీ అండ్ ఎఫ్ శాఖకు అదనపు బాధ్యత- బుడితి రాజశేఖర్
4. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ -కె. సునీత
5. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం కమిషనర్ బాధ్యత-డాక్టర్ జి. వాణి మోహన్
6.ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ప్లానింగ్ శాఖకు అదనపు బాధ్యత-పీయూష్ కుమార్
7.జీఏడీ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు-ముకేష్ కుమార్ మీనా
8.ఎంఐ అండ్ యూడీ శాఖకు ప్రధాన కార్యదర్శి-ఎస్. సురేష్ కుమార్
9. సివిల్ సప్లైస్ కమిషనర్ మరియు ప్రభుత్వానికి ఎక్స్-ఆఫిషియో సెక్రటరీ-సౌరభ్ గౌర్
10. హయ్యర్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్మెంట్ శాఖలకు అదనపు బాధ్యత-కోన శశిధర్
11.ITC&E శాఖ కార్యదర్శి; పలు అదనపు బాధ్యతలు-భాస్కర్ కాటమనేని
12.CEO, SERP-వి. కరుణ,
13. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ శాఖకు అదనపు బాధ్యత-యువరాజ్
14.సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి; గిరిజన సంక్షేమ శాఖకు అదనపు బాధ్యత-ముదవతు ఎం. నాయక్
15.ఇండస్ట్రీస్ & కామర్స్ (మైనింగ్) శాఖ కార్యదర్శి-ప్రవీణ్ కుమార్
16.CRDA కమిషనర్-కన్నబాబు
17. కార్మిక శాఖ కమిషనర్-ఎం.వి. శేషగిరి బాబు
18. ఎండోమెంట్స్ కమిషనర్,BC సంక్షేమ శాఖ కార్యదర్శి; EWS సంక్షేమ శాఖకు అదనపు బాధ్యత-ఎస్. సత్యనారాయణ
19.రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి; యూత్ అడ్వాన్స్‌మెంట్ & స్పోర్ట్స్‌కు అదనపు బాధ్యత-వడరేవు వినయ్ చంద్
20.హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మరియు MD, NHM-జి. వీరపాండియన్
21.రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ IG-హరి నారాయణన్
22.స్పోర్ట్స్ అథారిటీ VC&MD కు అదనపు బాధ్యత-గిరీష పి.ఎస్
23.CEO, NTR వైద్య సేవా ట్రస్ట్-పట్టనశెట్టి రవి సుబాష్
24.CDMA-పి. సంపత్ కుమార్-వి. అభిషేక్
25.ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం LA&RR

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.