AP Government: పదోతరగతి హాల్‌టికెట్లు విడుదలపై అప్‌డేట్… ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
AP SSC Hall Tickets: పదోతరగతి విద్యార్థులు హాల్ టికెట్లపై కీలక అప్ డేట్ వచ్చేసింది. విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్(bse.ap.gov.in)ను సందర్శించి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
అమరావతి: పదోతరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పదోతరగతి పబ్లిక్ పరీక్ష, మార్చి 2025 హాల్ టిక్కెట్‌లు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in)లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పింది. మీ పాఠశాల ద్వారా లాగిన్ చేసుకోవచ్చని తెలిపింది. మన మిత్ర, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవల ద్వారా (9552300009), విద్యా సేవలను పొందవచ్చని పేర్కొంది. దరఖాస్తు సంఖ్య, విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
SSC MARCH-2025
-10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2025 హాల్ టికెట్స్ విడుదల
👇👇👇👇👇
https://bse.ap.gov.in/apsschtttfy/HallTicketsSel.aspx
ఎస్సెస్సీ పరీక్షల హల్ టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి పొందవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే వాట్సాప్‌లోని మనమిత్ర ద్వారా (9552300009)ఎడ్యూకేషనల్ సర్వీస్‌ను సెలెక్ట్ చేయడం ద్వారా పొందవచ్చని స్పష్టం చేశారు. అప్లికేషన్ నెంబర్ లేదా విద్యార్థి ఐడీ, జన్మదిన తేదీ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. ఆల్ ది బెస్ట్, కీప్ సైనింగ్ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు