APOSS 10th, Inter March 2025 Fee Payment Schedule AP Open School 10th, Inter Public Exams March 2025 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, March -2025 Examination Fee Collection Schedule APOSS SSC, Inter Public Exams March 2025 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, March 2025 Examination Fee Payment Schedule, Instructions APOSS Public Examinations, March 2025 SSC & Intermediate EXAMS FEE SCHEDULE APOSS SSC & Intermediate Public Examinations, March 2025 Examination Timetable and schedule of exam fee collection
APOSS- SSC & Intermediate Public Examinations, March-2025- Schedule of exam fee collection from 23.12.2024 to 31.12.2024
APOSS 10th, Inter March 2025 Fee Payment Schedule Rc.No.APOSS-14022(38)/1/2024-EXAM/INTER-APOSS, dt.20/12/2024
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025 హాజరగుటకు గాను, పరీక్ష ఫీజా ది. 23.12.2024 నుండి 10.01.2025 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును.
- అపరాధ రుసుము లేకుండా ది. 23.12.2024 నుండి 31.12.2024 వరకును;
- అపరాధ రుసుము రూ.25/- తో ది. 01.01.2025 నుండి 04.01.2025 వరకును;
- అపరాధ రుసుము రూ.50/- తో ది. 05.01.2025 నుండి 08.01.2025 వరకును, మరియు
- తత్కాల్ రుసుము, ది. 09.01.2025 నుండి 10.01.2025 వరకు, ఇంటర్మీడియట్ నకు రూ.1000/- మరియు యస్.యస్.సి నకు రు.500/- తో పాటు ఆయా సబ్జెక్టు లకు నిర్దేశించిన పరీక్షా ఫీజును చెల్లించవలెను.
పరీక్షా ఫీజు చెల్లించుటకు కాల నిర్ణయ పట్టికను సార్వత్రిక విద్యా పీఠం వారి వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in .
పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చ్ 2025 పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:
గమనికలు:
పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు:
- 2024-25 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది. 31.08.2024 నాటికి యస్.యస్.సి. అభ్యర్థులు 14 సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం॥ వయస్సు నిండినవారు మాత్రమే పరీక్షఫీజు చెల్లించుటకు అర్హులు.
- ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు.
- ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు
పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చును. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. మరియు, APOSS website: www.apopenschool.ap.gov.in పొందు పరచబడిన, ‘పేమెంట్ గేట్వే ద్వారా, కూడా పరీక్ష రుసుమును, నెట్ బ్యాంకింగ్, డెబిట్ /క్రెడిట్ కార్డులతో, సెలవు దినములతో సహా ఎల్లవేళలా (24/7), చెల్లించవచ్చును.
ఎ.పి. టి. ఆన్ లైన్ / పేమెంట్ గేట్వే’ ద్వారా చెల్లించిన పరీక్ష రుసుము రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.
దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్షులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి. ఆన్ లైన్/ పేమెంట్ గేట్వే’, నందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి. ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.
ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.
పీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు.పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.
కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుమువాపసు ఇవ్వబడదు.
APOSS 10th, Inter Fee Payment Schedule 2025