అయితే, ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఇంతకీ డీల్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
భారత మార్కెట్లో లాంచ్ సమయంలో ఐఫోన్ 16e ధర 128GB మోడల్ ధర రూ. 59,900, 256GB మోడల్ ధర రూ. 69,900, 512 GB మోడల్ ధర రూ. 89,900కు పొందవచ్చు.
ఈ ధరలు ఇప్పటికీ ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. అయినప్పటికీ, ఈ ఐఫోన్ అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. 128GB మోడల్ రూ. 51,499, 256GB మోడల్ రూ.
62,490, 512GB మోడల్ రూ. 78,999 వద్ద లిస్ట్ అయింది.
49,499 (లాంచ్ ధర కన్నా రూ.10,401 తక్కువ), 256GB మోడల్ రూ. 60,490 (లాంచ్ ధర కన్నా రూ. 9,401 తక్కువ) 512GB మోడల్ రూ. 76,999 (లాంచ్ ధర కన్నా రూ.
12,901 తక్కువ)కు చేరుకుంటుంది.
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 3nm A18 చిప్‌తో అమర్చింది. సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఐఫోన్ 16లో కనిపించింది. 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.
5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, NFC GPS కనెక్టివిటీని అందిస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ కలిగి ఉంది. 18W వైర్డ్ ఛార్జింగ్, 7.5 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 146.7x 71.5x 7.8mm, బరువు 167 గ్రాములు ఉంటుంది.
































