ఫోన్​ లోనే కొత్త రేషన్​ కార్డ్​ అప్లై చేసుకోవడం ఎలా..?

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందాలంటే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాల్సిందే. అయితే దాదాపు 9 ఏళ్ల క్రితం రేషన్ కార్డుల జారీ ఆగిపోయింది.


దీంతో రాష్ట్రంలోని అనేక కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు మీ-సేవ కేంద్రాలకు దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. రేషన్​కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం, ఆధార్​కార్డు అప్​డేట్​ కోసం క జనాలు భారీగా తరలివస్తున్నారు.

కుటుంబ సభ్యుల పేర్లు..

రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లనూ చేర్చుతున్నారు. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు, అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను పౌర సరఫరాల శాఖ చేర్చుతుంది. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఫోన్​ లోనే కొత్త రేషన్​ కార్డ్​ అప్లై..

మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ లోనే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ స్టెప్స్ ఫాలో అయి మీరు కూడా ఫోన్ లోనే రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ముందుగా తెలంగాణ ఫుడ్​ సెక్యూరిటీ కార్డ్స్​ అధికారిక వెబ్ సైట్ ​ను ఓపెన్​ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ అని హోమ్​ పేజీలో ఎడమవైపు కనిపించే ఆప్షన్లలో FSC Search పైన క్లిక్ చేయాలి. అప్పుడు Ration Card Search అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్ లు మనకు కనిపిస్తాయి. అందులో FSC Application Search మీద క్లిక్ చేయాలి.

మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా సెలెక్ట్ చేసుకుని, అప్లికేషన్ నెంబర్ బాక్సులో దరఖాస్తు సమయంలో మీ సేవ రసీదు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మన అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు కింద కనిపిస్తాయి. ఒకవేళ ఎవరిదైన రేషన్ కార్డు రిజెక్ట్ అయితే దాని స్టేటస్ తెలుసుకునేందుకు Status of Rejected Ration Card మీద క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఇలా ఇంట్లోనుంచే సెల్ ఫోన్ లో మీ రేషన్ కార్డును అప్లై చేసుకోండి, చెక్ చేసుకోండి.