అర్హులైన విద్యార్థులందరూ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ ఇంటర్న్ షిప్ ఎంపికైన విద్యార్థులకు నెలవారీ భత్యం రూ.5000, ఒకసారి రూ.6000 మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 12 నెలల ఇంటర్న్ షిప్ కాలవ్యవధిలో కనీసం ఆరు నెలలు ఉద్యోగ శిక్షణ, వాస్తవ ప్రపంచ అనుభవాన్ని, వాణిజ్య నెట్వర్క్లను రూపొందించి ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండరాదని తెలిపారు. విద్యార్హతలు 10వ, 12వ, ఐటిఐ, పాలిటెక్నిక్, డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో (2023-24)లో కుటుంబ సంవత్సరాల ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://pminternship.mca.gov.in ద్వారా ఆసక్తి ఆధారంగా వివిధ రంగాల్లో అవకాశాలను అన్వేషించి గరిష్టంగా ఐదు ఇంటర్న్ షిప్ లను ఎంచుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. పరిధిలోని యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, స్వాతంత్రం పొందడానికి వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకునేలా అందరూ ప్రోత్సహించాలని తెలిపారు. ఈ ఇంటర్న్ షిప్ మొదటి దశలో ఇప్పటికే 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు సమర్పించారని, రెండవ దశలో భాగంగా దరఖాస్తుల ప్రక్రియ తేది 12-02-2025 నుంచి 11-03-2025 వరకు కొనసాగుతుందని ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ పథకం దరఖాస్తు కు సంబంధించి సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800116090 లేదా https://pminternship.mca.gov.in కు సంప్రదించగలరని కలెక్టర్ తెలిపారు.