పలు ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల (Notifications) పరీక్ష తేదీను ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటించింది. ఇందుకు గాను 8 నోటిపికేష్లనకు సంబంధించి ఏప్రిల్‌లో (April) పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.

ఏప్రిల్‌ 27 నుంచి 30 వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపింది.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కెమిస్టు , అసిస్టెంట్‌ ఎలిక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్‌వో, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లకు కలుపుకుని వాటికి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.