Switch Board : స్విచ్ బోర్డులు మురికిగా ఉన్నాయా..? మరి ఇలా చెయ్యండి.. చిటికెలో తెల్లగా వచ్చేస్తాయి..!

చాలా మంది ఇళ్లల్లో స్విచ్ బోర్డులు (switch board cleaning tips) నల్లగా మాసిపోయినట్లు కనబడుతూ ఉంటాయి. నిజానికి స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యము.
మనం హడావిడిలో ఏ చేతితో పడితే ఆ చేతితో స్విచ్ లని నొక్కేస్తూ ఉంటాము. దీనివలన వాటి మీద మచ్చలు పడుతూ ఉంటాయి కొన్నాళ్ళకి స్విచ్ బోర్డులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇల్లంతా బాగుండి స్విచ్ బోర్డులు మురికిగా ఉంటే ఏం బాగుంటుంది…? కనుక వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి.


బాబోయ్ స్విచ్ బోర్డులని కూడా క్లీన్ చేసుకోవాలా ఎక్కువ సమయం పట్టేస్తుందని మీరు భయపడక్కర్లేదు. క్షణాల్లో మీరు స్విచ్ బోర్డులని క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా పెద్ద కష్టమేమీ కాదు మీ ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో ఈజీగా స్విచ్ బోర్డులని శుభ్రం చేసుకోవచ్చు.

వెనిగర్:

వెనిగర్ ని స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవడానికి వాడొచ్చు. రెండు టీ స్పూన్ల వెనిగర్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు నీళ్లు వేసి టూత్ బ్రష్ తో కానీ ఒక క్లాత్ తో కానీ స్విచ్ బోర్డ్ ల మీద రుద్దండి. ఇలా చేయడం వలన స్విచ్ బోర్డు మీద మురికి త్వరగా పోతుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా తో కూడా మీరు ఈజీగా స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసుకోవచ్చు.

నెయిల్ పాలిష్ రిమూవర్:

మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ ని ఉపయోగించి స్విచ్ బోర్డ్ ల మీద మురికి ని తొలగించవచ్చు.

ఆల్కహాల్:

ఆల్కహాల్ కూడా స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది కాబట్టి ఆల్కహాల్ తో కూడిన మెటీరియల్స్ ఏదైనా మీరు వాడొచ్చు.

స్విచ్ బోర్డులని శుభ్రం చేసిన తర్వాత ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వండి..

స్విచ్ బోర్డ్ ని శుభ్రం చేసిన తర్వాత వెంటనే స్విచ్ లని వెయ్యొద్దు కాసేపు ఆగి ఆ తర్వాత వేయండి పూర్తిగా స్విచ్ బోర్డ్ ఆరిన తర్వాత మాత్రమే మీరు స్విచ్ లని వేయండి కరెంట్ భయం ఉన్న వాళ్లు మెయిన్ ఆఫ్ చేసుకుని స్విచ్ బోర్డ్స్ ని శుభ్రం చేసుకోవడం మంచిది.

చివరగా..

స్విచ్ బోర్డ్ లని క్లీన్ చేస్తున్న క్రమంలో మీరు చేతికి గ్లౌజులని వేసుకోండి అలానే చెప్పులని వేసుకోండి. ఇలా సేఫ్టీ టిప్స్ ని కూడా పాటించడం అవసరం.