గోల్డ్ లోన్ బుక్
గత రెండు సంవత్సరాలలో అవుట్‌స్టాండింగ్ గోల్డ్ లోన్స్ బాగా పెరిగాయి. అవి 2023 నవంబర్‌లో రూ.898 కోట్ల నుంచి 2024 నవంబర్‌కి రూ.1.59 లక్షల కోట్లకు చేరాయి. అలానే 2025 నవంబర్ నాటికి రూ.3.5 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఒక సంవత్సరంలోనే బంగారు రుణాల పరిమాణం రెట్టింపు అయింది. గత ఆరు నెలల్లో వృద్ధి బలంగా ఉందని RBI డేటా సూచిస్తోంది.
బంగారం ధరలతోనే డిమాండ్
2025లో బంగారం ధరలు దాదాపు 64 శాతం పెరగడంతో గోల్డ్ లోన్స్‌లో పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు దాదాపు రూ.1.35 లక్షల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు పెరగడంతో తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ కూడా పెరిగింది. అంటే రుణగ్రహీతలు తక్కువ బంగారంతో ఎక్కువ అమౌంట్ పొందే అవకాశం కలిగింది. కొలేటరల్ వ్యాల్యూలో ఈ పెరుగుదల గోల్డ్ లోన్లను మరింత ఆకర్షణీయంగా, సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించింది.
పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కూడా తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను విస్తరించాయి. అవుట్‌స్టాండింగ్ లోన్స్ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే బ్యాంకులు ఇప్పుడు మార్కెట్ వాటాలో NBFCలను అధిగమించాయి. RBI తాజా డేటా ప్రకారం, మొత్తం గోల్డ్ లోన్స్‌లో బ్యాంకుల వాటా 50.35 శాతం కాగా, మిగిలిన వాటా ఫైనాన్స్ కంపెనీల పేరిట ఉంది. ఈ రంగంలో కీలక కంపెనీలుగా ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, IIFL ఫైనాన్స్ కనిపిస్తున్నాయి. RBI ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకులు, NBFCల నుంచి వచ్చిన బంగారు రుణాలు మొత్తం బకాయి రుణాలలో 5.8 శాతంగా ఉన్నాయి.
ఇతర లోన్ సెగ్మెంట్స్ గ్రోత్ ఎలా ఉంది?
బంగారు రుణాలతో పాటు, అనేక ఇతర క్రెడిట్ విభాగాలు కూడా వృద్ధిని కనబరిచాయి. నవంబర్ చివరి నాటికి వెహికల్ లోన్స్ ఇయర్ ఆన్ ఇయర్ 11 శాతం పెరిగి రూ.6.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి పండుగ డిమాండ్, GST తగ్గింపు కలిసొచ్చాయి. పర్సనల్ లోన్స్ 12.7 శాతం పెరిగాయి, కమర్షియల్ రియల్ ఎస్టేట్ లోన్స్ 12.5 శాతం పెరిగాయి. క్రెడిట్ టూ సర్వీస్ 11.7 శాతం పెరిగింది. పర్సనల్ లోన్స్‌లో కొన్ని ఏరియాలు మందగించాయి. మొత్తం అవుట్‌స్టాండింగ్ క్రెడిట్‌లో హోమ్ లోన్స్ వాటా 16.43 శాతానికి స్వల్పంగా తగ్గింది. అలానే క్రెడిట్ కార్డ్ బకాయి 1.52 శాతానికి తగ్గింది.