ఆస్ట్రేలియన్ ( Australian ) ఆల్ రౌండర్ అమండా వెల్లింగ్టన్ ( Amanda Wellington ) ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈమె ఆస్ట్రేలియన్ క్రికెటర్.
ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ త్వరలోనే భారతదేశానికి కోడలు కాబోతోంది. పంజాబ్ కు చెందిన హంరాజ్ ( Hamraj ) అనే అబ్బాయిని అమండా వెల్లింగ్టన్ వివాహం చేసుకోబోతోంది. కొద్దిరోజుల క్రితమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అమండా వెల్లింగ్టన్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో అమండా వెల్లింగ్టన్ కు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు, క్రికెటర్లు స్పెషల్ గా విషెస్ చెబుతున్నారు.
ఇండియాకు కోడలు కాబోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్….!
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంగీత కచేరీలో దిల్జిత్ దోసాంజ్ కు జెర్సీని బహుమతిగా అమండా వెల్లింగ్టన్ ( Amanda Wellington ) ఇస్తూ హంరాజ్ కు కనిపించిందట. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని సమాచారం. దీంతో ఇద్దరూ ప్రేమలో పడి, చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా హంరాజ్ ( Hamraj )ను వివాహం చేసుకున్న అనంతరం అమండా వెల్లింగ్టన్ భారతదేశంలో అడుగుపెట్టనుంది. ఈ మేరకు అమండా వెల్లింగ్టన్ మాట్లాడుతూ వివాహం జరిగిన తర్వాత ఆమెకు ఇండియా పౌరసత్వం లభించినట్లయితే, భారతదేశం తరఫున క్రికెట్ ఆడాలని తన కోరిక అని ఆమె వెల్లడించింది. ఇండియా తరఫున క్రికెట్ ఆడాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
WBBL లో రాణిస్తున్న అమండా (Amanda Wellington )
ఆస్ట్రేలియాకు చెందిన అమండా వెల్లింగ్టన్ రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తుంది. ఆమె మంచి స్పిన్నర్ కూడా. లెగ్స్ పిన్ వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది అమండా వెల్లింగ్టన్. ఇక ఇప్పటి వరకు ఆస్ట్రేలియా కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడింది అమండా వెల్లింగ్టన్. ఇందులో రెండు వికెట్లు పడగొట్టిన అమండా వెల్డింగ్టన్, 65 యావరేజ్ సంపాదించింది. అలాగే 2016 నుంచి 2022 వరకు కేవలం 14 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడింది అమండా వెల్లింగ్టన్. ఇందులో 18 వికెట్లు పడగొట్టింది. 29.8 అవేరేజ్ సంపాదించింది అమండా. అలాగే 2017 నుంచి 2018 వరకు టి20 ఫార్మాట్ లో కూడా ఈమె రాణించారు. ఈ నేపథ్యంలోనే 8 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించింది. పది వికెట్లు పడగొట్టింది. ఇక చాలా రోజుల నుంచి ఆస్ట్రేలియా జట్టులో అమండా వెల్లింగ్టన్ (Amanda Wellington ) ఛాన్స్ రావడం లేదు. కానీ మహిళల బిగ్ బాష్ లీగ్
( Women’s Big Bash League)లో రాణిస్తున్నారు. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు (Adelaide Strikers ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
































