బాబా వంగా జోతిష్యం ప్రకారం.. 2025లో జరగబోయే దారుణాలు ఇవే.. ప్రపంచం అంతం అప్పుడే

www.mannamweb.com


ప్రపంచవ్యాప్తంగా కొంత మంది జ్యోతిష్కులు చాలా పాపులర్‌ అయ్యారు. వీరు భవిష్యత్తును ఊహించిన చెప్పిన జ్యోతిష్య అంచనాలు చాలా వరకు నిజమయ్యాయని, నిజమవుతాయని చాలా మంది నమ్ముతున్నారు.
ఇలాంటి వారిలో నోస్ట్రాడమస్, బాబా వంగా చాలా పాపులర్‌ అయ్యారు. అయితే ఇప్పుడు బాబా వంగా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 2025వ సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జ్యోతిష్యం ఆందోళన కలిగిస్తోంది.

బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించారు. 12 ఏళ్ల వయసులో తుపానులో చిక్కుకోవడంతో ఆమె కంటి చూపు కోల్పోయారు. ఆ తర్వాత జ్యోతిష్యంతో పాపులర్ అయ్యారు. జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలోని బెలాసికా పర్వతాల ప్రాంతంలోనే గడిపారు. ఆమెను ‘బాల్కన్ నోస్ట్రాడమస్’ అని కూడా పిలుస్తారు. 1996లో ఆమె మరణించింది. ఆ తర్వాత కూడా ఆమె ఫ్యూచర్ ప్రిడిక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

* 2022 నుంచి 5079 వరకు ఏం జరుగుతుంది?

బాబా వంగా వేల సంవత్సరాల భవిష్యత్తు గురించి అంచనాలు వేశారు. అందులో కీలకమైనవి చూద్దాం.

2022: ప్రకృతి వైపరీత్యాలు, కొత్త వైరస్‌లు, నీటి కొరత, మిడతల దాడి.
2023: భూమి కక్ష్యలో స్వల్ప మార్పు.
2025: యూరప్ జనాభా తగ్గుదల.
2028: ఒక కొత్త శక్తి వనరు క్రియేట్‌ అవుతుంది. ప్రపంచ ఆకలి నిర్మూలన జరుగుతుంది, మానవులు శుక్రునిపై అడుగుపెడతారు.

2033: వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.

2043: ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఐరోపా ఇస్లామిక్‌గా మారుతుంది.
2046: సింథటిక్ అవయవాలు భారీగా ఉత్పత్తి అవుతాయి.

2066: యూఎస్‌లో ‘పర్యావరణ విధ్వంసక’ ఆయుధం ఆవిష్కరణ.

2076: సామాజిక కుల వ్యవస్థ పతనం.

2084: ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకుంటుంది.
2088: వైరస్ వేగంగా వృద్ధాప్యానికి కారణమవుతుంది.

2097: వైరస్ నిర్మూలన.

2100: కృత్రిమ సూర్యుడు భూమి చీకటి వైపు వేడి పుట్టిస్తాడు.
2111: మానవులు మరింత రోబోటిక్‌గా మారతారు.
2123: నిరంతర యుద్ధంలో చిన్న దేశాలు భాగమవుతాయి, అగ్రరాజ్యాలు దూరంగా ఉంటాయి.
2125: హంగేరీ లోతైన ప్రదేశం నుంచి సంకేతాలను అందుకుంటుంది, బాబా వంగా మళ్లీ వస్తుంది.
2130: గ్రహాంతర సహాయంతో సముద్రగర్భ సమాజాలు ఏర్పడతాయి.

2154: జంతువులు మనిషిలాగా పరిణామం చెందుతాయి.
2167: కొత్త మతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది.
2170: భూమి ఎండిపోయి ఎడారిగా మారుతుంది.
2183: మార్స్ కాలనీ స్వయం సమృద్ధిగా మారుతుంది, సార్వభౌమత్వాన్ని కోరుతుంది.
2187: అగ్నిపర్వత విస్ఫోటనాలు అణిచివేస్తారు.
2195: ఇండిపెండెంట్ అండర్‌ వాటర్‌ కమ్యూనిటీలు ఏర్పడతాయి.
2196: ఐరోపా, ఆసియా జాతులు కలిసిపోవడంతో యూరో-ఆసియా జాతి రూపాలు పుడతాయి.

2201: సూర్యుడు చల్లబడి, భారీ వాతావరణ మార్పులకు కారణమవుతుంది.
2221: గ్రహాంతరవాసుల గురించి మానవులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి.
2256: గెలాక్టిక్ వైరస్ తిరిగి రాకెట్ ద్వారా భూమికి తిరిగి వస్తుంది.
2262: గ్రహశకలం విధ్వంసంతో మార్స్ ప్రమాదం ఎదుర్కొంటుంది.
2271: భౌతిక స్థిరాంకాలు మారుతాయి, ప్రస్తుత సూత్రాలు అననుకూలంగా ఉంటాయి.
2273: ఆఫ్రో-యురేషియన్ జాతి జెనెటిక్‌ మిక్సింగ్ నుంచి ఏర్పడుతుంది.
2279: బ్లాక్ హోల్స్ నుంచి కొత్త శక్తి కనుగొంటారు.

2288: టైమ్ ట్రావెల్ కనుగొంటారు. మానవులు, గ్రహాంతరవాసులను కలుస్తారు.
2291: సూర్యుడు మరింత చల్లబడతాడు, మానవులు దానిని మళ్లీ వేడి చేయడానికి ప్రయత్నిస్తారు.
2296: సౌర మంటలు సాధారణం, గురుత్వాకర్షణ శక్తిలో మార్పులతో ఉపగ్రహాలు క్రాష్ అవుతాయి.
2299: ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహిస్తుంది.

2302: న్యాయ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలు, సార్వత్రిక చట్టాలు కనుగొంటారు.
2304: మానవులు చంద్రుడిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.
2341: అంతరిక్షం నుంచి భూమి తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.
2354: ఊహించని సమస్యల కారణంగా భూమి అంతటా నీటి కొరత ఏర్పడుతుంది.
2371: కరువు ఒక ప్రధాన ప్రపంచ సమస్యగా మారుతుంది.
2378: మానవుల కొత్త జాతి ఉద్భవిస్తుంది.

2480: రెండు కృత్రిమ సూర్యుల ఢీకొనడం వల్ల మొత్తం బ్లాక్అవుట్ అవుతుంది.
3005: అంగారక గ్రహంపై అరాచకం, యుద్ధం మొదలవుతాయి. గ్రహాల అక్షసంబంధ మార్పులు జరుగుతాయి.
3010: గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టి, ధూళి మేఘాన్ని సృష్టిస్తుంది.
3797: అన్ని జీవులు అదృశ్యమవుతాయి, మానవులు కొత్త సౌర వ్యవస్థలో కాలనీలను సృష్టిస్తారు.

3803: కాలనీలు తక్కువ జనాభా, వాతావరణం కారణంగా జన్యు ఉత్పరివర్తనలు జరుగుతాయి.
3805: వనరుల కోసం యుద్ధాలు, జనాభా పతనానికి దారి తీస్తాయి.
3815: యుద్ధ కాలం ముగుస్తుంది.
3854: నాగరికత పురోగమించడం ఆగిపోతుంది, మానవత్వం గిరిజనతత్వానికి మారుతుంది.
3871: కొత్త మతం నైతికత, ఆచారాలను పునర్నిర్వచిస్తుంది.
3874: కొత్త మతం విస్తృతంగా ప్రాచుర్యం పొందుతుంది.
3878: చర్చి చాలా కాలంగా మరచిపోయిన శాస్త్రీయ సూత్రాలను బోధిస్తుంది.

4302: సైన్స్, టెక్నాలజీని స్వీకరించడం వల్ల నగరాలు మళ్లీ కనిపిస్తాయి.
4302: యూనివర్సల్‌ క్యూర్‌ కనుగొంటారు.
4308: మెదడులో జరిగే అభివృద్ధి తక్కువ స్వార్థపూరిత మానవత్వానికి దారితీస్తుంది.
4509: మానవులు నైతిక భావన వల్ల దేవునితో సంభాషిస్తారు.
4599: అమరత్వం ప్రమాణం అవుతుంది.

4674: మానవ శ్రేయస్సు 340 బిలియన్ల మానవుల వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది, గ్రహాంతర సమ్మేళనం జరుగుతుంది.
5076: విశ్వం అంచును కనుగొంటారు.
5078: మనుషులుతెలిసిన విశ్వాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది, 40% తిరస్కరిస్తారు.
5079: ప్రపంచం అంతం అవుతుంది.

* బాబా వంగా అంచనాలు నిజమయ్యాయి
1980లో బాబా వంగా రష్యాలోని కుర్స్క్ నీటిలో మునిగిపోతుందని, ప్రపంచం దుఃఖిస్తుందని అంచనా వేశారు. 2000లో కుర్స్క్ సమీపంలో రష్యా అణు జలాంతర్గామి మునిగిపోయింది, 188 మంది సిబ్బంది మరణించారు. అలానే 1989లో ‘ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేసి, అమాయకుల రక్తాన్ని చిందిస్తున్నాయి’ అని అంచనా వేశారు. ఈ అంచనా 2001 9/11 దాడులని నమ్ముతున్నారు. హైజాక్ చేసిన విమానాలు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్‌లను తాకాయి. బరాక్ ఒబామాను ప్రస్తావిస్తూ యునైటెడ్ స్టేట్స్ తన మొదటి నల్లజాతి అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని బాబా వంగా అంచనా వేశారు. అయితే, అతడే చివరి వ్యక్తి అని కూడా ఆమె పేర్కొంది.

ఆమె 1969లో ఇందిరా గాంధీ మరణాన్ని ముందే అంచనా వేసినట్లు చెప్పారు, ఆ సమయంలో ఆమె నారింజ-పసుపు రంగు దుస్తులు ధరిస్తుందని చెప్పారు. 1984లో కాషాయ చీర కట్టుకుని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. బాబా వంగా 2022లో కరువు, వరదలతో సహా తీవ్రమైన వాతావరణ సంఘటనలను అంచనా వేశారు. ఆ సంవత్సరం యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియాలోని పెద్ద నగరాలు తీవ్రమైన నీటి కొరత, వరదలను ఎదుర్కొన్నాయి. 1990లో 1996 ఆగష్టు 11న తాను చనిపోతానని చెప్పింది, అలానే జరిగింది.

* బాబా వంగా అంచనాల గురించి సందేహం
చాలామంది బాబా వంగా సామర్థ్యాలను విశ్వసిస్తే, మరికొందరు సందేహాస్పదంగా ఉన్నారు. బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం చాలా వరకు నిజమైందని నమ్ముతున్నా సరే, ఆమె చెప్పిన కొన్ని జరగలేదు. 2016 నాటికి యూరప్ నాశనమవుతుందని, 2010- 2014 మధ్య అణుయుద్ధం జరుగుతుందని కూడా ఆమె అంచనా వేశారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలు జరగలేదు.