Bangladesh – ఒకప్పటి సముద్రమే.. నేటి బంగ్లాదేశ్‌! – 2.3 కోట్ల సంవత్సరాల్లో భూమిగా రూపాంతరం

www.mannamweb.com


ఒకప్పటి సముద్రమే.. నేటి బంగ్లాదేశ్‌!
2.3 కోట్ల సంవత్సరాల్లో భూమిగా రూపాంతరం

నదులు సముద్రాల్లో కలిసేచోట నీటితోపాటు భూమిపై ఉండే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలు అన్నీ సముద్రంలో కలిసిపోతాయి. బంగ్లాదేశ్ వద్ద ఇలా ఇవన్నీ క్రమంగా చేరుతూ వేల కిలోమీటర్ల మేర సముద్రాన్నే ఆక్రమించేశాయన్న మాట! ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఏకంగా 2.30 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ కాలాన్ని నిర్ధారించడానికి జియోఫిజికల్ , సీస్మిక్ విధానాల్ని వినియోగించారు. ఇంతలా సముద్ర విస్తీర్ణం మాయమైన దాఖలాలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కేఎస్ కృష్ణ తెలిపారు.