Bank Holidays: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!

www.mannamweb.com


Bank Holidays: నిత్య జీవితంలో ఏదోక సందర్భంలో బ్యాంకుకు వెళ్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బ్యాంకుకు వెళ్తే ఈరోజు సెలవని చెబుతారు.

దాంతో మనం ఒకింత నిరాశకు గురౌతాం. అందుకే ముందుగానే నెలలో ఎన్నిరోజులు బ్యాంకు పని చేస్తుంది..ఎన్ని రోజులు సెలవలున్నాయనే విషయాలను తెలుసుకుని వెళ్లడం మంచిది.

రేపటితో జూన్ నెల పూర్తవుతుంది. జులై నెల సోమవారం నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో జులై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవు రోజులు మొత్తం కలిపి జులైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి…ఒకసారి ఆ సెలవుల లిస్ట్ ఏంటో చూసేద్దామా..!

జులై 3 (బుధవారం) : బెహ్ డైన్ ఖ్లామ్ (మేఘాలయ).
జులై 6 (శనివారం) : ఎంహెచ్ఐపీ డే (మిజోరం)
జులై 7 (ఆదివారం) – వారాంతపు సెలవు
జులై8 (సోమవారం): కాంగ్ (రథ జాతర – మణిపూర్).
జులై 9 (మంగళవారం) దృక్పా షేజీ (సిక్కిం).
జులై 13 (రెండో శనివారం) : వారాంతపు సెలవు.
జులై 14 (ఆదివారం) : వారాంతపు సెలవు జులై 16 (మంగళవారం): హరెలా (ఉత్తరాఖండ్)
జులై 17 (బుధవారం) : ముహర్రం / అషూరా / యూ టిరోట్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర).
జులై 21 (ఆదివారం): వారాంతపు సెలవు.
జులై 27 (నాలుగో శనివారం) : వారాంతపు సెలవు
జులై 28 (ఆదివారం) : వారాంతపు సెలవు.