తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు 5G సేవలుఅధికంగావినియోగించుకోవడమే . అధిక వేగం, విస్తృత కవరేజ్, అన్‌లిమిటెడ్ ప్లాన్ల కారణంగా రిలయన్స్ జియో ఈ డేటా వృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తోంది.

దేశవ్యాప్తంగా భారత్‌లో వినియోగించే మొత్తం మొబైల్ డేటాలో దాదాపు 60% ట్రాఫిక్‌ను జియోనే. 2025 సెప్టెంబర్ త్రైమాసికంలో జియో వినియోగదారుల సగటు డేటా వినియోగం నెలకు 38.7 GBకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 31.0 GBతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. అయితేవిశ్లేషకుల అంచనాల ప్రకారం, జియో వినియోగదారులు సగటున రోజుకు సుమారు 1 GB డేటాను వినియోగిస్తున్నారు. ఇది ఇతర టెలికాం ఆపరేటర్ల వినియోగదారుల సగటు నెలవారీ వినియోగం (15-28 GB) కంటే చాలా ఎక్కువ.


5Gకు మారడం వల్ల వినియోగ విధానాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఓపెన్‌సిగ్నల్ (OpenSignal) నివేదిక ప్రకారం, 5G కవరేజ్, నెట్‌వర్క్ స్థిరత్వంలో జియో మార్కెట్‌లో ముందంజలో ఉంది. జియో 5G లభ్యత దాదాపు 70%కు చేరువలో ఉంది. ముఖ్యంగా జియో వినియోగదారుల 5Gలో గడిపే సమయం 67.3%గా ఉండగా, ఇతర సంస్థల వద్ద ఇది కేవలం 28% మాత్రమేఉంది. జియో స్టాండ్అలోన్ 5G కారణంగా వినియోగదారులు డేటా సెషన్ మొత్తం 5Gలోనే ఉండగలుగుతున్నారు. దీని ఫలితంగా డేటా వినియోగం మరింత పెరుగుతోంది.

ఈ ధోరణులు ఏపీ, తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. తెలంగాణను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో వైర్‌లెస్ మొబైల్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ విభాగాల్లో జియో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 నవంబర్‌లో జియో ఈ రెండు రాష్ట్రాల్లోనే అత్యంత వేగంగా ఎదిగిన ఆపరేటర్‌గా నిలిచింది. సుమారు 1.17 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుని మొత్తం వినియోగదారుల సంఖ్యను దాదాపు 3.18 కోట్లకు పెంచుకుంది.

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో వృద్ధి ఇంకా వేగంగా ఉంది. ఒకే నెలలో సుమారు 50,000 కొత్త వైర్‌లైన్ వినియోగదారులు చేరారు. ఇది టైర్-2, టైర్-3 పట్టణాల్లో జియోఫైబర్, ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తోంది. జియో నెట్‌వర్క్ విస్తరణ పరిమాణం చూస్తే డేటా ట్రాఫిక్ ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో 5G బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా హైస్పీడ్ డేటా విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. వీడియో స్ట్రీమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ ఆధారిత సేవల కోసం వినియోగదారులు రోజుకు అనేక గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నారు.

4G, 5Gలోనూ జియో ఆధిపత్యం:

4G, 5G రెండింట్లోనూ జియో ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, స్టాండ్అలోన్ 5Gనే ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా మారింది. ఓపెన్‌సిగ్నల్ అంచనాల ప్రకారం, జియో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 45% ఇప్పుడు 5G ద్వారానే వెళ్తోంది. 5G వినియోగదారులు 4Gతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. నాన్-స్టాండ్అలోన్ 5G వినియోగదారులు తరచుగా మళ్లీ 4Gకు మారాల్సి రావడం వల్ల అధిక పరిమాణంలో నిరంతర డేటా వినియోగం పరిమితమవుతోంది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్, 5G ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ కూడా ఈ డేటా బూమ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ సేవల వేగవంతమైన విస్తరణతో గృహస్థాయిలో డేటా వినియోగం భారీగా పెరిగింది. చాలా మంది వినియోగదారులు ఇప్పుడు నెలకు పదిల నుంచి వందల గిగాబైట్ల వరకు డేటాను వినియోగిస్తున్నారు.

మొత్తంగా చూస్తే 5G వేగం పెరుగుతున్న కొద్దీ ఏపీ, తెలంగాణరాష్ట్రాలు అధిక డేటా వినియోగ మార్కెట్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. 5G, ఫైబర్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లలో కొనసాగుతున్న పెట్టుబడులతో ఈ రెండు రాష్ట్రాల్లో డేటా వినియోగం మరింత పెరగనుంది. తద్వారా ఇవి భారతదేశ డిజిటల్ వృద్ధి తదుపరి దశకు బలమైన ఆధారంగా నిలవనున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.