Review – భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా ట్యాగ్ వదిలేసి రవితేజ చేసిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.


ఈ సంక్రాంతి బరిలో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత విడుదలైన సినిమా. యూకే, అమెరికాలో ప్రీమియర్ షోలు మిగశాయి. మరి సినిమా టాకేంటి? ఎన్నారై ఆడియన్స్ సినిమా గురించి ఏమంటున్నారో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకోండి.

రవితేజ ఈజ్ బ్యాక్ అనొచ్చా?
ఫస్ట్ టైమ్ మా రవన్న సినిమాకు ఇంత పాజిటివ్ రివ్యూలు రావడం అని రవితేజ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన రివ్యూలలో రవితేజ ఈజ్ బ్యాక్ అన్నట్టు కొందరు రాశారు.

రవితేజ తన క్యారెక్టర్ వరకు ఎటువంటి లోటు లేకుండా బాగా చేశారట. అయితే, ఈ సినిమాలోని ఆయన క్యారెక్టర్ లేదా కథలో మాత్రం కొత్తదనం లేదట. ఇదొక రెగ్యులర్ మసాలా సినిమా అంటున్నారు. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లతో ఇంతకు ముందు వచ్చిన సినిమాల తరహాలో కథ సాగిందట.

కామెడీ వర్కవుట్ అయ్యింది!
యూకే నుంచి కావచ్చు… అమెరికా నుంచి కావచ్చు… ఓవర్సీస్ నుంచి వచ్చిన టాక్ చూస్తే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో కామెడీ వర్కవుట్ అయ్యింది. ఇంటర్వెల్ ముందు, తర్వాత కొన్ని మంచి కామెడీ సీన్లు వర్కవుట్ అయ్యాయట. ల్యాగ్ ఎక్కువ లేదట. రవితేజ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యిందట.

భీమ్స్ పాటల్లో రెండు బావున్నాయ్!

భీమ్స్ అందించిన పాటల్లో రెండు తెరపై కూడా బావున్నాయని ప్రీమియర్స్ చూసిన జనాలు చెబుతున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుందట. రీసెంట్ టైమ్స్‌లో రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బెటర్ ప్రోడక్ట్ అనేది చాలా మంది చెప్పే మాట.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.