టాటా చిప్ ప్లాంట్ కు భూమి పూజ.. 27 వేల మందికి ఉద్యోగాలు

www.mannamweb.com


భారత దేశంలో టాటా గ్రూప్ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దేశంలో అతి పెద్ద వాణిజ్య సంస్థల్లో టాటా గ్రూప్ సంస్థ అన్ని రంగాల్లో విస్తరించింది. ముఖ్యంగా ఉప్పు నుంచి బంగారం వరకు ఈ సంస్థలో ప్రవేశించని రంగం లేనిదంటూ లేదు. ఇలా ప్రతి దాంట్లో టాటా పేరు వినడబడుతునే ఉంటుంది. పైగా భారతీయులకు కూడా ఈ సంస్థ ఉత్పత్తులపై ఎనలేని నమ్మకం. ఇదిలా ఉంటే.. తాజాగా టాటా గ్రూప్ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ అస్సోం రాష్ట్రంలో మరో కొత్త వ్యాపారంను ప్రారంభించాబోతుంది. పైగా ఆ వ్యాపారంకు సంబంధించిన భూమి పూజ కూడా జరిగింది. ఇక అస్సాం రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రారంభిస్తున్న వ్యాపారంలో సుమరు 27 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్ర శేఖరన్ పేర్కొన్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా టాటా గ్రూప్ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ అస్సోం రాష్ట్రంలో రూ.27 వేల కోట్లతో సెమీకండక్టర్ చిప్ అసెంబ్లీ ప్లాంట్ ను నిర్మిస్తుంది. పైగా ఈ చిప్ అసెంబ్లీ ప్లాంట్ నిర్మాణానికి శనివారం భూమి పూజ కూడా చేశారు. కాగా, వచ్చే ఏడాది 2025 నాటి కల్లా ఈ ప్లాంటులో కార్యకలాపాలు మొదలవుతాయాని రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ తాజాగా పేర్కొంది. అయితే ఈ ప్లాంట్ భూమి పూజలో పాల్గొన్న టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ నిర్మాణం వలన అస్సోం రాష్ట్రంలో సుమారు 27 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించకముందే ఇప్పటికే అస్సోంలో 1000 మంది వరకు ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఇకపోతే ఈ ప్లాంట్ కు 27 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందన్నారు. అందులో 15 వేల మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని చెప్పారు. అందుకోసం ఈ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ పనులు 2024 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నమన్నారు. ఆనంతరం ఇందులో చిప్ తయారీ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఇక ఇతర సెమీకండక్టర్ కంపెనీలు సైతం తొలుత సరఫరాదారుగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, దీని క్రమంగా ఆ సంస్థలు సైతం దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిప్ ప్లాంట్ లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ ప్లాంటులో పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో రోజుకు 4.83 కోట్ల చిప్పులను తయారు చేస్తుందని తెలిపారు. పైగా ఇక్కడ తయారయ్యే సెమీ కండక్టర్ చిప్స్ లను ప్రతి పెద్ద కంపెనీ తమ వాహనాల తయారీలో ఉపయోగించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.