IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

www.mannamweb.com


సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ కూడా సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రయాణాలు చేయడానికి తత్కాల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి బిగ్ షాక్ తగిలింది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ డౌన్ అయ్యింది.

ఇలా జరగడం మూడోసారి..

గత రెండు నెలల్లో IRCTC సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఇలా జరగడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. సరిగ్గా టికెట్లు బుక్ చేసుకునే సమయానికి ప్రతీసారి ఇలా జరగడంతో IRCTC అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కూడా ఇలానే టికెట్లు బుక్ కావడం లేదని మరికొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.