కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల పై బిగ్ అప్డేట్..!!

www.mannamweb.com


ఏపీలో కొత్త రేషన్ కార్డులు .. పెన్షన్ల మంజూరు ఎప్పుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తవి జారీ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

ప్రస్తుతం పెన్షన్లలో అనర్హులకు కోత వేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు. జనవరి లో జన్మభూమి -2 ప్రారంభం సైతం వాయిదా పడినట్లు కనిపిస్తోంది. అయితే, కొత్తగా రేషన్ కార్డులు .. పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

జన్మభూమి వాయిదా

కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ముందు గా అనర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందు కోసం సర్వే కొనసాగుతోంది. జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లు ఈ నెల 31 నే పంపిణీ చేయనున్నారు. వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసు కోకపోయినా ఈ నెల కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, జన్మభూమి వచ్చే నెలలో ప్రారంభించాలని కొద్ది నెలల క్రితమే నిర్ణయించారు. అయితే, జన్మభూమి లో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు.. పెన్షన్ల తో పాటుగా పథకాల కోసం లబ్ది దారులు వేచి చూస్తున్నారు. దీంతో, తాజాగా జన్మభూమి నిర్వహణ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

లబ్దిదారుల నిరీక్షణ

ఇటు రాష్ట్రంలో పింఛన్ల పరిశీలన పూర్తిచేయాలని, అనర్హులను తొలగించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. జన్మభూమి సభల్లోనే రేషన్‌ కార్డులు, సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, జన్మభూమి సభలకు వచ్చే విజ్ఞాపనల పరిష్కారానికి నిధుల కొరత ఉన్నందున ప్రస్తుతానికి జన్మభూమి నిర్వహణను విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సూపర్ సిక్స్ హామీలుగా ఉన్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు నెలకు రూ.1500 ఆర్ధిక సాయం, ఉచిత బస్సు, డిఎస్‌సి పోస్టుల భర్తీ, కానిస్టేబుల్స్‌ ఎంపిక ప్రక్రియలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

కేబినెట్ భేటీలో నిర్ణయం

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కొత్త రేషన్ కార్డులు.. కొత్త పెన్షన్ల మంజూరు ఆగిపో యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో, మార్చిలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత సంక్షేమ పథకాల అమలుకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అయితే, కొత్త రేషన్ కార్డులు – పెన్షన్ల పైన ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితో ముందుగా దరఖాస్తుల స్క్రూటినీ.. లబ్దిదారుల ఎంపిక వంటివి చేయాలి అనే ఆలోచన ప్రతిపాదన దశలో ఉంది. ఈ కీలక అంశాల పైన జనవరి 2న జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.