Breaking:చంద్రబాబు,లోకేష్‌కు కొత్త టెన్షన్..హైకోర్టు కీలక నిర్ణయం?

www.mannamweb.com


ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నామినేషన్ తేదీలు కూడా వెల్లడించారు. ఈసారి ఎన్నికలు ఏపీలో కొత్త చరిత్రను సృష్టించబోతాయా అన్నట్టు పోటీపోటీగా ఉంది. సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా ప్రచారం జోరు పెంచారు. వైసీపీని ఎలాగైనా ఓడించే లక్ష్యంతో అటు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణకు టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే..నామినేషన్‌కు సమయం దగ్గరపడుతోంది.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా కచ్చితంగా నామినేషన్‌లో భాగంగా తమపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైనా తేడా వచ్చినా, తమకు తెలిసి, తెలియక ఎక్కడైనా కేసులు నమోదైన ఆ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేకపోతే పరిశీలనలో వారి నామినేషన్లు తిరస్కరిస్తారు. అయితే ఈ విషయంలో వారిపై రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని కోరుతున్నా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వీరు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రాకపోవడంతో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు వీరికి కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తుంది.