ఇద్దరు కూతుళ్లను కన్నతల్లే కడతేర్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధిర (Madhira) మండల పరిధిలోని నిదానపురంలో షేక్ బాజీ (Shaik Baji), పైజా (Paiza) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే షేక్ బాజీ (Shaik Baji)ని ఓ చోరీ కేసులో పోలీసులు పీఎస్కు తీసుకెళ్లారు. అయితే, అవమాన భారంతో పైజా (28) తన ఇద్దరు కుమార్తెలు మెన్రూల్ (7), మెహక్ (6)లను అతి కిరాతకంగా ఉరేసి చంపేసింది.
అనంతర తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
































