BSNL వార్షికోత్సవ ఆఫర్.. వారందరికీ ఉచితంగా 24జీబీ డేటా.. ఎలా పొందాలంటే?

www.mannamweb.com


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో బంపర్ ఆఫర్‌తో వచ్చింది. ఇప్పటికే టారిఫ్ పెంపు పోటీలో ప్రత్యర్థి సంస్థలకు మేకులా తయారైన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఉచితంగా 4జీ డేటా అందిస్తుండడం గమనార్హం. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లను ప్రకటిస్తోందీ. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతోంది. కొద్ది రోజుల్లోనే 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది ఉచితంగా 24 జీబీ 4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది.

24 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమ కస్టమర్లకు ఉచితంగా 24జీబీ డేటా అందించేందుకు నిర్ణయించినట్లు సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఈ సంస్థ కస్టమర్లు ఈ ఆఫర్ పొందాలనుకుంటే రూ.500 ఆపైన విలువైన వోచర్‌తో రీఛార్జ్ చేసుకోవాలని తెలిపింది. ఇలా రూ.500 పైన రీఛార్జ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ 24జీబీ డేటా ఉచితంగా లభిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చిందని, రీఛార్జ్ చేసుకున్న వారికి ఉచితం డేటా అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే, అక్టోబర్ 24 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తేదీలోపు రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఉచిత డేటా అందనుందని గుర్తుంచుకోవాలి.

దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను కొద్ది రోజుల క్రితమే పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ సగం రేటుకే మంచి ప్లాన్లు అందిస్తుండడంతో తమ నెట్‌వర్క్ మార్చుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ప్రత్యర్థి సంస్థలు అందిస్తున్న ప్లాన్లను మించి డేటా, వ్యాలిడిటీ కల్పిస్తూ తక్కువ ధరకే ప్లాన్లు ఇస్తుండడంతో ఇప్పుడు అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లిందని చెప్పవచ్చు. మరోవైపు.. 2000, సెప్టెంబర్ 15వ తేదీన బీఎస్ఎన్ఎల్ సంస్థను స్థాపించారు. అక్టోబర్ 1, 2000 సంవత్సరం నుంచి ఢిల్లీ, ముంబై మినహా దేశవ్యాప్తంగా టెలికాం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్.