LG ఎలక్ట్రానిక్స్ ఇండియా సంస్థ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. LG స్మార్ట్ టీవీ వాడుతున్న యూజర్లందరికీ ఫ్రీగా టీవీ అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది. దాంతో LG ఛానెల్స్‌లో ఏకంగా 100కు పైగా కొత్త ఛానెళ్లు యాడ్ అయ్యాయి. దీంతో ఇకపై మీకు కావాల్సినంత వినోదం మీ టీవీల్లోనే ఉచితంగా దొరుకుతుంది. నెలనెలా డబ్బులు కట్టే సబ్‌స్క్రిప్షన్లు, తలనొప్పి తెప్పించే సెట్-టాప్ బాక్స్‌లు అస్సలు అవసరం లేదు.
ఎంచక్కా మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్, తాజా న్యూస్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, పిల్లల స్పెషల్ షోలు, లైఫ్‌స్టైల్ ప్రోగ్రామ్స్.. ఇలా అన్నీ ఉచితంగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ అప్‌డేట్‌లో హైలైట్, ఇది చాలా భాషల్లో అందుబాటులో ఉండటమే. LG ఛానెల్స్‌లో ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు.
మన తెలుగుతో పాటు తమిళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్ వస్తుంది. అంటే ఇంట్లో ఎవరికి ఏ భాష కావాలంటే ఆ భాషలో టీవీ చూసేయొచ్చు. స్ట్రీమింగ్ సర్వీసుల రేట్లు మండిపోతున్న ఈ రోజుల్లో, LG ఛానెల్స్ లాంటి యాడ్స్ సపోర్ట్ చేసే ఫ్లాట్‌ఫామ్స్‌కి మాత్రం డిమాండ్ పెరుగుతోంది. * కేబుల్ టీవీ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఈ ఫాస్ట్ (FAST – ఫ్రీ యాడ్-సపోర్టెడ్ టెలివిజన్) సర్వీసులు కేబుల్ టీవీ చూసినట్టే ఉంటాయి కానీ, నెలనెలా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే LG స్మార్ట్ టీవీ ఉన్నవాళ్లకి ఇది చాలా మంచి వార్త. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని ప్రోగ్రామ్స్ కావాలంటే అన్ని ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అదీ రూపాయి ఖర్చు లేకుండా.
ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి.. LG ఛానెల్స్ యాప్ మీ LG స్మార్ట్ టీవీల్లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. సింపుల్‌గా యాప్ ఓపెన్ చేస్తే చాలు, మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సైన్ అప్ చేసుకోవడం, లాగిన్ అవ్వడం వంటి తలనొప్పి పనులేమీ ఉండవు.
ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి.. LG ఛానెల్స్ యాప్ మీ LG స్మార్ట్ టీవీల్లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. సింపుల్‌గా యాప్ ఓపెన్ చేస్తే చాలు, మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సైన్ అప్ చేసుకోవడం, లాగిన్ అవ్వడం వంటి తలనొప్పి పనులేమీ ఉండవు.
“LG ఛానెల్స్‌లో ఇప్పుడు అన్ని రకాల ఆసక్తులు, అన్ని ఏజ్ గ్రూప్‌ల వాళ్లకి నచ్చేలా 100కు పైగా ఫ్రీ ఛానెళ్లు ఉన్నాయి. అంతేకాదు, వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగ్గా మార్చేందుకు పర్సనలైజ్డ్ కంటెంట్‌ను కూడా తీసుకొస్తాం. దాంతో ఎవరూ మంచి కంటెంట్ అన్వేషణలో టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.” అని ఆయన తెలిపారు. * ఉచిత స్ట్రీమింగ్ సర్వీసుల వైపే మొగ్గు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు అందరూ ఫ్రీ స్ట్రీమింగ్ సర్వీసుల వైపే మొగ్గుచూపుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో మిగతా టీవీ బ్రాండ్స్ కూడా ఇలాంటి మోడల్స్‌నే ఫాలో అయ్యే అవకాశముంది. ఏదేమైనా, LG స్మార్ట్ టీవీ వాడుతున్నవాళ్లకి మాత్రం ఇది నిజంగా గుడ్ న్యూస్. మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి అంతే, కానీ కంటెంట్ మాత్రం అదిరిపోతుంది.
































