Burning Sensation In Feet: ప్రస్తుతం చాలామందిలో విటమిన్ బి 12 లోపం వల్ల అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి. విటమిన్ బి12 లోపం వల్ల కూడా ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ విటమిన్ లోపం కారణంగా ప్రతి పది మందిలో తొమ్మిది మంది అరికాళ్ళలో మంట సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
చాలామందిలో అరికాళ్ళలో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తినడం కారణంగా ఈ మంట సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి అయితే శరీరంలో విటమిన్ బి 12 లోపం వల్ల కూడా వస్తున్నాయని వారన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలను ఎంత సులభంగా తగ్గించుకుంటే అంత మంచిది లేకపోతే తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అరికాళ్ళలో మంట తగ్గడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాత్రలో వేడినీటిని తీసుకొని అందులో అరికాళ్ళను ఆరు నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో నాలుగు నిమిషాల పాటు అరికాళ్ళను చల్లని నీటిలో పెట్టాలి. ఇలా ప్రతిరోజు మూడుసార్లు చేయడం వల్ల అరికాళ్ళలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా సులభంగా మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
తరచుగా అరికాళ్ళ మంటలతో బాధపడేవారు గుమ్మడికాయతో తయారుచేసిన మిశ్రమం ద్వారా కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని అరికాళ్ళకు అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా అరికాళ్ళ మంటలు తగ్గే వరకు అప్లై చేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుమ్మడికాయతో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.