ఔను.! మొన్నటిదాకా ఐబొమ్మ ఒక్కటే. దాంతోపాటు బప్పమ్ టీవీని కూడా అతడి చేతులతోనే మూతేయించారు పోలీసులు. కానీ, ఇప్పుడదే ఐబొమ్మ ఊడలమర్రిలా అన్ని కార్నర్స్‌ని కెలికేస్తూ, విశృంఖలంగా వ్యాపిస్తోంది.
కొత్తకొత్త యాప్‌లు, సైట్లను కేరాఫ్‌లుగా మార్చుకుని పేట్రేగిపోతోంది. ఒక వెబ్‌సైట్ లింక్‌ను ఇంకో సైట్లో పేస్ట్ చేస్తే లేటెస్ట్ మూవీలు చూడొచ్చు. ఇది పైరసీగాళ్ల లేటెస్ట్ టెక్నాలజీ. గతంలో ఐబొమ్మ, బప్పం సైట్లలో ఉన్న క్వాలిటీ లను మరో వెబ్‌సైట్లలో చూపించేస్తున్నారు పైరసీ క్రిమినల్స్. అదెలాగో చూద్దాం.
ఐబొమ్మ వెబ్‌సైట్లు బ్లాక్ అయిన కొద్దిరోజులకే ఐబొమ్మ వన్ పేరుతో ఇంకో కొత్త వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. కానీ, ఇందులో నేరుగా కంటెంట్ పెట్టకుండా, లేయర్ల రూపంలో థర్డ్ పార్టీ వెబ్‌సైట్ ద్వారా చూపిస్తున్నారు పైరసీగాళ్లు. ఐబొమ్మ వన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే మొదట్లో లకు సంబంధించిన రివ్యూలు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే దాని కింద మనం అడిగిన మూవీ URL వస్తుంది. ఆ URLను కాపీచేసి, SBI టర్మ్ lapse లాంటి థర్డ్ పార్టీ సైట్‌లోకి వెళితే అక్కడ paste URL అని బాక్స్ కనిపిస్తుంది. అందులో URL పేస్ట్ చేస్తే యధేచ్ఛగా ఆ మొత్తం అక్కడ డిస్‌ప్లే అవుతోంది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్‌లో పైరసీ లు ఎలా వస్తున్నాయంటూ అవాక్కవడం పోలీసుల వంతైంది. SBI టెక్నికల్ టీమ్‌ను పిలిచి వివరాలు సేకరిస్తోంది సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్. ఇది ఎస్‌బీఐ నిర్వహిస్తున్న సైటేనా? లేక మాల్‌వేర్ ద్వారా దూరి మరొకరు దూరిపోయారా? అని ఆరా తీస్తున్నారు. పోర్టల్ నుంచి లింక్‌ను తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అటు, ఐబొమ్మ సిస్టర్ వెబ్‌సైట్లు మూతబడినా, ఆ పేరును మిగతా పైరసీ వెబ్‌సైట్లు విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి. ఐబొమ్మ ప్లస్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే.. అది Movie rulz అనే పైరసీ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతోంది. ఆ విధంగా ఐబొమ్మ వ్యూయర్స్‌ని తమవైపు లాగేసుకుంటూ పండగ చేసుకుంటున్నాయి మిగతా పైరసీ సైట్లు.
సో.. ఐబొమ్మ కథ ముగిసింది అనుకుంటే మూవీరూల్స్ ముఠా కొత్తగా చాలెంజ్ విసురుతోంది. మూవీ రూల్స్ నిందితులను ఆల్రెడీ అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నా.. దాని ఉనికి కంటిన్యూ ఔతూనే ఉంది. ఒక వెబ్‌సైట్‌ని బ్లాక్ చేస్తే మరో వెబ్‌సైట్‌లోకి మారుతూ పైరసీ మూవీలను అప్లోడ్ చేస్తున్నారు. గత ఫ్రైడే నవంబర్ 14న రిలీజైన లు కూడా మూవీరూల్స్‌లో దర్శనమిస్తున్నాయంటే వాళ్లెంత అప్‌డేటెడ్‌గా ఉన్నారో తెలుస్తోంది. అటు, ఐబొమ్మ రవిపై ఉచ్చు బిగుసుకుంటోంది. ల పైరసీతో ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్న రవిని, ఇప్పుడు పోలీసులు రివర్స్‌లో ఆడుకుంటున్నారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకుని విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ వ్యవహారాన్ని నడిపాడా? అతడి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? టెక్నికల్ సపోర్ట్ ఎక్కడినుంచి తీసుకున్నాడు? లాంటి వివరాల్ని లోతుగా ఆరా తీస్తున్నారు. కానీ, పోలీసులు ఎంత ప్రశ్నించినా, తన పార్ట్‌నర్స్ వివరాలపై నోరు మెదపడం లేదట.
గతంలో నమోదైన పైరసీ కేసులతో పాటు ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. హిట్, తండెల్, సింగిల్, కిష్కింధపురి ల పైరసీపై నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో కూడా రవిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఒక్క కేసులోనే రవి అరెస్ట్ చూపించిన పోలీసులు, ప్రొసీజర్ ప్రకారం మిగతా కేసుల్లో కూడా అరెస్ట్ చూపించాల్సి ఉంది. ఐబొమ్మ రవి వెనుక పెద్ద నెట్‌వర్కే ఉందని తేలడంతో సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి మరింత పని పెరిగింది. పైరసీ లింకులు, క్రిప్టో ట్రాన్సాక్షన్లపై ఫోకస్ పెట్టారు. నిన్నటిదాకా సినీ పరిశ్రమను వణికించిన ఐబొమ్మ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అగమ్యగోచరంగా ఉంది.
































